BiggBoss 6 Day 77 : జంటని విడదీసిన బిగ్‌బాస్.. ఈ వారం ఎలిమినేషన్ పూర్తి..

బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపు దగ్గర పడేకొద్దీ కంటెస్టెంట్స్ మధ్య గేమ్ రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లో బెస్ట్ ప్లేయర్ అనుకున్నవారే ఎలిమినేట్ అవుతుండడంతో ప్లేయర్స్ అందరూ గేమ్ లో సీరియస్‌నెస్ పెంచేశారు. ఈ ఆదివారంతో 11వ వారం ఎలిమినేషన్ కూడా పూర్తీ అయ్యింది. ఈ ఎలిమినేషన్ తో హౌస్ లో ఉన్న ఏకైక జంటను విడదీశాడు బిగ్‌బాస్ . రోహిత్-మెరీనా కపుల్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ వారం ఎలిమినేషన్ తో...

BiggBoss 6 Day 77 : జంటని విడదీసిన బిగ్‌బాస్.. ఈ వారం ఎలిమినేషన్ పూర్తి..

Marina eliminated from BiggBoss season 6

BiggBoss 6 Day 77 : బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపు దగ్గర పడేకొద్దీ కంటెస్టెంట్స్ మధ్య గేమ్ రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లో బెస్ట్ ప్లేయర్ అనుకున్నవారే ఎలిమినేట్ అవుతుండడంతో ప్లేయర్స్ అందరూ గేమ్ లో సీరియస్‌నెస్ పెంచేశారు. ఇక ఈ వీకెండ్ నాగార్జున కొంతమంది కంటెస్టెంట్స్ కి గట్టి క్లాస్ పీకాడు. బిగ్ బాస్ చెపింది చేయకుండా నీకు నచ్చింది చేస్తానంటే నువ్వు కూడా గీతూలాగే వెళ్ళిపోతామంటూ ఆదిరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

BiggBoss 6 Day 76 : గీతూ పోయింది.. ఆదిరెడ్డి వంతు.. ఆదిరెడ్డిపై ఫైర్ అయినా నాగార్జున..

ఈ ఆదివారంతో 11వ వారం ఎలిమినేషన్ కూడా పూర్తీ అయ్యింది. ఈ ఎలిమినేషన్ తో హౌస్ లో ఉన్న ఏకైక జంటను విడదీశాడు బిగ్‌బాస్ . రోహిత్-మెరీనా కపుల్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ వారం ఎలిమినేషన్ తో మెరీనా బయటకి వెళ్లాల్సి వచ్చింది. మెరీనా బయటకి రావడంతో రోహిత్ దుఖాన్ని ఆపుకోలేకపోయాడు. దీంతో హౌస్ లో కంటెస్టెంట్స్ లెక్క 9కి చేరింది.

అయితే ఎలిమినేషన్ కి ముందు పది మంది కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిగా లోపలికి పిలిచి.. టాప్ 5 ఎవరు? బోటమ్ 5 ఎవరు? అని అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. టాప్‌లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా ఉండగా, బోటమ్‌లో రాజ్, రోహిత్, కీర్తి, మెరీనా, ఇనయా ఉన్నారు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఆడకపోతే వారు వీరవుతారు, వీరు వారవుతారు అంటూ హెచ్చరించాడు నాగార్జున.

అలాగే మెరీనా వెళ్ళేటప్పుడు హౌస్‌లో ప్యూర్ ఎవరు? ప్యూర్ కానిది ఎవరు? అనే టాస్క్ ఇవ్వగా.. ఇంట్లో ప్యూర్ గా ఉండేది ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, రాజ్, కీర్తి అని. ప్యూర్ కానిది శ్రీహాన్, శ్రీ సత్య, ఇనయా, ఫైమా అని వెల్లడించింది.