Mehar Ramesh : కచ్చితంగా పవర్ స్టార్‌తో నా సినిమా ఉంటుంది

తాజాగా బిల్లా సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మెహర్ రమేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో కచ్చితంగా నా సినిమా ఉంటుంది. చిరంజీవి గారితో చేయాలి అనుకున్నాను, చేస్తున్నాను. పవన్ గారితో కూడా............

Mehar Ramesh : కచ్చితంగా పవర్ స్టార్‌తో నా సినిమా ఉంటుంది

Mehar Ramesh says he will do a movie with pawan kalyan defenetly

Mehar Ramesh :  మెహర్ రమేష్ పేరు వింటే కొంతమంది హీరోల అభిమానులు భయపడతారు. తమ హీరో మాత్రం మెహర్ రమేష్ తో సినిమా తీయకూడదు అనుకుంటురు. గతంలో మెహర్ రమేష్ దర్శకుడిగా కన్నడలో రెండు సినిమాలు తీసి మంచి విజయం సాధించాడు. అయితే తెలుగులో మాత్రం శక్తి, కంత్రి, బిల్లా, షాడో సినిమాలు తీసి డిజాస్టర్స్ ఇచ్చాడు. వీటిల్లో బిల్లా సినిమా ఒక్కటి యావరేజ్ గా నిలిచింది. సినిమా నిర్మాణవిలువల పరంగా కూడా బిల్లా చాలా బాగుంటుంది. ప్రభాస్ కెరీర్ లో బిల్లా సినిమా ఒక స్టైలిష్ గా నిలిచింది.

తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. దీనికి విపరీతమైన స్పందన లభించింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేశారు ఈ సినిమా రీ రిలీజ్ కి. మెహర్ రమేష్ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం మెహర్ రమేష్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సినిమా వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతుంది. చిరు అభిమానులు మెహర్ తో ఎందుకు సినిమా తీస్తున్నాడు చిరంజీవి అని అనుకుంటున్నారు. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు.

Avika Gor : హీరోయిన్, నిర్మాతగా అవికా గోర్ మరో సినిమా.. కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో ఉమాపతి..

తాజాగా బిల్లా సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మెహర్ రమేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో కచ్చితంగా నా సినిమా ఉంటుంది. చిరంజీవి గారితో చేయాలి అనుకున్నాను, చేస్తున్నాను. పవన్ గారితో కూడా సినిమా ఉంటుంది, లేట్ అయినా సరే తప్పకుండా పవన్ కళ్యాణ్ తో నా సినిమా ఉంటుంది అని తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా పవన్ అభిమానులు మాత్రం మెహర్ తో సినిమా వద్దు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ అటు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఒప్పుకున్న సినిమాలకే డేట్లు ఇవ్వలేకపొతున్నాడు. మరి మెహర్ సినిమా ఉన్నా ఇప్పట్లో దరిదాపుల్లో కూడా ఉండదు అని మాత్రం అర్ధమవుతుంది.