Money Heist: దుమ్ము రేపుతున్న”మనీ హీస్ట్” ప్రమోషనల్ సాంగ్.. రాధికా ఆప్టే కోరిక ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ "మనీ హీస్ట్" సీజన్ 5

Money Heist: దుమ్ము రేపుతున్న”మనీ హీస్ట్” ప్రమోషనల్ సాంగ్.. రాధికా ఆప్టే కోరిక ఏంటో తెలుసా?

Money Heist

Money Heist ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ “మనీ హీస్ట్” సీజన్ 5 విడుదలకు రంగం సిద్ధం అయింది. మరో 10 రోజుల్లో(సెప్టెంబర్-3,2021) నెట్ ఫ్లిక్స్ లో మనీ హేస్ట్ సీజన్ 5 విడుదలవుతోంది. మొదటి నాలుగు సీజన్లతో నెట్ ఫ్లిక్స్ లో ఇంటర్నెట్ మొబైల్ డేటా బేస్ (ఐఎమ్డిబి), రోటేన్ టొమాటో వంటి పలు రేటింగ్ సైట్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకొని మంచి రేటింగ్ సాధించి నెట్ ఫ్లిక్స్ లో హీస్ట్(దోపిడీ లేదా దొంగతనం)కి సంబంధించిన వెబ్ సిరీస్ లోనే మొదటి స్థానంలో నిలిచింది మనీ హీస్ట్. ఈ సిరీస్ లోని ప్రొఫెసర్ పాత్రతో అల్వరో మర్టో తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్ర “రాకేల్ మరిల్లో”, టోక్యో, బెర్లిన్, రియో, డెన్వర్, బోగట్టా, మాస్కో వంటి పలు పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఈ నాలుగు ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.

Money Heist

Money Heist

అయితే సీజన్ 5 ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యి సూపర్ హిట్ అవగా..తాజాగా ఈ సిరీస్ కి సంబంధించి ఓ కొత్త పాట పలు భాషల్లో విడుదల అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ లో ప్రముఖ సినీ స్టార్లతో “మనీ హీస్ట్ ఫ్యాన్ ఆంథమ్” టైటిల్ తో ఓ ప్రోమోను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్ ఇండియా. మనీ హీస్ట్ పాపులర్ అయిన బెల్లా చావ్ ట్యూన్ లోనే ఈ పాట కూడా ఉంది. ఈ ప్రమోషనల్ సాంగ్ లో బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్ స్టార్లు కనిపించారు. ఈ ప్రమోషన్ సాంగ్ లో..అనిల్ కపూర్, రాధికా ఆప్టే, రానా దగ్గుబాటి మరియు శృతి హాసన్ వంటి భారతీయ నటులు వివిధ భాషలలో ‘త్వరలో రా’ అంటూ పాడుతూ ప్రేక్షకుల్లో ఆశక్తిని మరింత పెంచారు.

తాజా వీడియో…. గత మనీ హీస్ట్ సీజన్ ల నుండి నుండి కొన్ని క్షణాలను గుర్తుచేస్తోంది. ఇందులో శృతి హాసన్ తన నోటిలో ఓ చిన్న పువ్వుతో నైరోబిని( సీజన్ 4 లో మరణించిన పాత్ర)తలుచుకోవడం, మొదటి దోపిడీ సమయంలో డెన్వర్ పాత్రలాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా మనీ బెడ్‌పై డ్యాన్స్ చేయడం..ఫైనల్ సీజన్‌లో అర్టురో చనిపోవాలని కోరుకుంటున్నానని రాధికా ఆప్టే వీడియోలో చెప్పడం…నెటిజన్లలో మరింత ఆశక్తి పెంచింది.

Money Heist Netflix

Money Heist etflix

కాగా,మనీ హీస్ట్ సీజన్- 5 రెండు భాగాలుగా విభజించబడింది. మొదటిది వాల్యూమ్ 1 అనే పేరుతో సెప్టెంబర్‌-3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. వాల్యూమ్ 2 డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఈ స్పానిష్ సిరీస్ కథ… ప్రొఫెసర్ అని పిలిచే సూత్రధారి మరియు బ్యాంక్ దొంగతనం కోసం కలిసి పనిచేసే దొంగల బృందం చుట్టూ తిరుగుతుంది. సీజన్ 4లో ప్రొఫెసర్ డైరక్షన్ తో.. దొంగల బృందం సేఫ్ గా బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నుంచి డబ్బులు కొట్టేసి తప్పించుకోగా..సీజన్ -5లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ “రఖెల్ మోరియో”వారిని పట్టుకోగలుగుతుందా లేదా అనేది ఆశక్తికరంగా మారంది. అంతేకాకుండా సీజన్ 4 చివర్లో దొంగల ముఠా నాయకుడు “ఫ్రొఫెసర్” తో పోలీస్ ఆఫీసర్ రాకేల్ మరిల్లో ప్రేమలో పడినట్లు చూపించడంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో అని అందరూ ఆశక్తిగా ఈ సిరీస్ కోసం ఎదరుచూస్తున్నారు.