Mrunal Thakur : ఆ సినిమా చూపించాకే నన్ను సినిమాల్లోకి పంపించారు.. లేకపోతే డెంటిస్ట్ అయ్యేదాన్ని..

మృణాల్ ఠాకూర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను డెంటిస్ట్ కోర్స్ ఎంట్రెన్స్ రాస్తే అందులో మంచి మార్కులు వచ్చాయి. కోర్సులో కూడా జాయిన్ చేపించేవాళ్ళు మా పేరెంట్స్. కానీ నా మనసులో..................

Mrunal Thakur : ఆ సినిమా చూపించాకే నన్ను సినిమాల్లోకి పంపించారు.. లేకపోతే డెంటిస్ట్ అయ్యేదాన్ని..

Mrunal Thakur says a movie turns my life to cinema career

Mrunal Thakur :  మోడల్ గా, సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకున్న మృణాల్ ఠాకూర్ ఇటీవలే సీతారామం సినిమాలో సీతగా ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. ఈ సినిమాతో దేశమంతటా పేరు తెచ్చుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే పెంచుకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలిపింది.

Cobra Movie Promotions : హైదరాబాద్ లో కోబ్రా మూవీ ప్రమోషన్స్ హంగామా

మృణాల్ ఠాకూర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను డెంటిస్ట్ కోర్స్ ఎంట్రెన్స్ రాస్తే అందులో మంచి మార్కులు వచ్చాయి. కోర్సులో కూడా జాయిన్ చేపించేవాళ్ళు మా పేరెంట్స్. కానీ నా మనసులో ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. మా ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళకి త్రీ ఇడియట్స్ సినిమా చూపించాను. అందులో తమ కలలను సాకారం చేసుకోవాలి అని ఎంత బాగా చూపించారో మా పేరెంట్స్ కి అర్థమయి నా సినిమా కెరీర్ కి ఒప్పుకున్నారు. ఆ తర్వాత నా ప్రయత్నాలు మొదలుపెట్టాక మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు” అని చెప్పింది. ఇలా ఒక సినిమా చూపించి తనకిష్టమైన కెరీర్ లోకి మృణాల్ వచ్చిందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.