Nani : సినిమాల్లో లిప్ కిస్‌లపై క్లారిటీ ఇచ్చిన నాని.. మా ఇంట్లో గొడవలు అవుతాయి కానీ..

నాని 30వ సినిమాగా హాయ్ నాన్న(Hi Nanna) అంటూ రాబోతున్నాడు. నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.

Nani : సినిమాల్లో లిప్ కిస్‌లపై క్లారిటీ ఇచ్చిన నాని.. మా ఇంట్లో గొడవలు అవుతాయి కానీ..

Nani Gives Clarity on Scenes with Mrunal Thakur in Hi Nanna Teaser

Nani : న్యాచురల్ స్టార్ నాని మినిమమ్ గ్యారెంటీ హీరో. కష్టపడి సొంతంగా ఎదిగిన నటుల్లో ఒకరు నాని. కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటలు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి సక్సెస్ అయ్యాడు. ఇటీవల దసరా సినిమాతో 100 కోట్ల భారీ విజయం కూడా సాధించాడు. ఇప్పుడు నాని 30వ సినిమాగా హాయ్ నాన్న(Hi Nanna) అంటూ రాబోతున్నాడు.

నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. తండ్రి కూతుళ్ళ ఎమోషన్ తో పాటు, ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. నిన్న ఆదివారం నాడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హాయ్ నాన్న టీజర్ రిలీజ్ చేయగా ఇందులో మృణాల్ తో నాని లిప్ కిస్ లు ఉన్నాయి. గతంలో కూడా నాని కృతిశెట్టితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో లిప్ లాక్ రొమాన్స్ చేశాడు.

దీంతో ఫ్యామిలీ హీరోలా అనిపించే నాని కూడా లిప్ కిస్ ల వెంట పడ్డాడు ఏంటి అని అంతా అనుకుంటున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో మీడియాతో ముచ్చటించగా ఓ మీడియా ప్రతినిధి నానిని లిప్ కిస్ ల గురించి అడిగారు. ఇటీవల మీ సినిమాల్లో లిప్ కిస్ లు ఉంటున్నాయి, ఎందుకు? మీరే పెట్టించుకుంటున్నారా? డైరెక్టర్స్ పెడుతున్నారా? అని అడిగారు.

Also Ready : టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ లవ్ ఫెయిల్యూర్.. ఆ బాధతో అర్ధరాత్రి బాత్రూంలో..

దీనికి నాని సమాధానమిస్తూ.. అన్ని సినిమాల్లో ఎక్కడుంది? లాస్ట్ సినిమా దసరా, అంతకుముందు సినిమా అంటే సుందరానికి సినిమాల్లో లేవు. గతంలో కూడా లేవు. నేను నటుడ్ని, డైరెక్టర్ అడిగినదాని బట్టే నేను చేస్తాను. అక్కడ సన్నివేశాన్ని బట్టి డైరెక్టర్ రాసుకుంటే నేనేం చేయలేను. అయినా ఈ సీన్స్ వల్ల మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి. అలా అని డైరెక్టర్ చెప్పినా, కథకు అవసరం అయినా నేను చేయను అని చెప్పకూడదు కదా అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే.. ఈ టీజర్ ఇప్పుడేగా రిలీజయింది. ఇంటికి వెళ్ళాక ఏం అవుతుందో చూడాలి అని సరదాగా అన్నారు నాని.