Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’పై నేచురల్ స్టార్ నాని కామెంట్స్.. ఏమన్నాడంటే..?

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల దగ్గర్నుండి విమర్శకుల వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై నేచురల్ స్టార్ నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’పై నేచురల్ స్టార్ నాని కామెంట్స్.. ఏమన్నాడంటే..?

Natural Star Nani Comments On Oke Oka Jeevitham

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల దగ్గర్నుండి విమర్శకుల వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Oke Oka Jeevitham: తన సినిమా టికెట్లు తనకే దొరకలేదని అంటోన్న ‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్!

తాజాగా ఈ సినిమాపై నేచురల్ స్టార్ నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాను తాజాగా వీక్షించిన నాని, ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలు ఒకేసారి వస్తాయని అన్నారు. ఇలాంటి కంటెంట్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసిందని నాని అన్నాడు. ఇక ఈ సినిమాలో శర్వానంద్, అమలా అక్కినేనిల పర్ఫార్మెన్స్ ప్రతిఒక్కరినీ కట్టిపడేసిందని, ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

ఏదేమైనా ఒక చక్కటి చిత్రానికి అందరి దగ్గర్నుండి ప్రశంసలు వస్తుండటంతో ఒకే ఒక జీవితం చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రీతూ వర్మలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.