NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.

NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!

NBK108 Movie: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెచ్చిపోయి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK108: అఫీషియల్.. బాలయ్యతో సినిమా కన్ఫం చేసిన అనిల్ రావిపూడి!

కాగా, తాజాగా బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ పౌర్ణమి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన బ్లాక్‌బస్టర్ కొలాబరేషన్ గురించి చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా మరోసారి థమన్ తన పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది బాలయ్యకు అఖండ చిత్రంతో బ్లాక్‌బస్టర్ రీసౌండ్ ఇచ్చిన థమన్, ఈ ఏడాది NBK107కు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

NBK108: బాలయ్య సినిమాకు అల్ట్రా స్టైలిష్ టైటిల్.. నిజమేనా?

ఇప్పుడు బాలయ్య 108వ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండటంతో బాలయ్య-థమన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ రెడీ అవుతుందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్‌తో నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని గెటప్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడట. కాగా, ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తోండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెడతారో చూడాలి. ఇక ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను రూపొందిస్తోంది.