Surprise In Bimbisara 2: బింబిసార-2లో సరికొత్త సర్‌ప్రైజ్.. ఏమిటంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కాగా బింబిసార-2 మూవీలో ఓ సర్‌ప్రైజ్ కూడా ఉండబోతుందట.

Surprise In Bimbisara 2: బింబిసార-2లో సరికొత్త సర్‌ప్రైజ్.. ఏమిటంటే?

New Surprise In Bimbisara 2 Movie

Surprise In Bimbisara 2: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. పూర్తిగా ఫాంటెసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన బింబిసార చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అందించారు.

Bimbisara Part 2 : బింబిసార 2 స్టోరీ చెప్పేసిన కళ్యాణ్ రామ్

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో బింబిసార-2 మూవీ ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బింబిసార-2 చిత్రం సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. బింబిసార చిత్రానికి ముందు జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా బింబిసార-2 మూవీలో ఓ సర్‌ప్రైజ్ కూడా ఉండబోతుందట.

Bimbisara: బింబిసార కళ్యాణ్ రామ్ కాదా.. మరెవరు?

ఈ సినిమాలో బింబిసారకు ఓ లేడీ విలన్ కూడా ఉంటుందట. ఈ పాత్ర కోసం ఓ పాపులర్ హీరోయిన్‌ను తీసుకోనున్నారట. ఇక ఈ సినిమా కథ 5వ శతాబ్దం నేపథ్యంలో రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకు పక్కా స్క్రిప్టును రాస్తున్నాడట. కాగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నాడట.