Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్.. ఆమెను అలా చూసి షాక్ అవుతున్న నెటిజెన్లు!

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్‌తో కుర్రాళ్లకు మొదటి క్రష్ గా మారిన నటి ''నివేదా థామస్''. 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ''శాకిని డాకిని'' సినిమా కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తుంది. అయితే ఈ సినిమాలో నివేదా థామస్ ఫుడీగా కనిపించనుంది. అయితే సినిమాలో సన్నగానే కనిపించిన...

Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్.. ఆమెను అలా చూసి షాక్ అవుతున్న నెటిజెన్లు!

Nivetha Thomas Fat Looks in Recent Instagram Reel

Updated On : September 9, 2022 / 5:35 PM IST

Nivetha Thomas: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్‌తో కుర్రాళ్లకు మొదటి క్రష్ గా మారిన నటి ”నివేదా థామస్”. 2016లో జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా ఈ బ్యూటీ, కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేసుకుంటూ వచ్చింది. అందుకనే ఈమె నటించిన చిత్రలేవంటే వేళ్ళపై లెక్కించి చెప్పేయొచ్చు.

Shakini Dakini : శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా..

ప్రస్తుతం నివేదా మలయాళంలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేస్తుండగా.. ఇందిలో తెలుగు సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ”శాకిని డాకిని” సినిమా కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో నివేదాతో పాటు రెజీనా కసాండ్రా కూడా నటిస్తుంది. యాక్షన్ కామెడీగా రాబోతున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా 16న రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ సినిమాలో నివేదా థామస్ ఫుడీగా కనిపించనుంది. అయితే సినిమాలో సన్నగానే కనిపించిన, ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మాత్రం చాలా లావుగా కనిపిస్తుంది. ఇందులో నివేదా ‘శాకిని డాకిని’ చిత్రంలోని సాంగ్‌కి తన సోదరుడు నిఖిల్ థామస్‌తో కలిసి డాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆమెను గుర్తుపట్టడానికి కొంత సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)