Bandla Ganesh : లవ్ యు అంటూ కేసీఆర్ ని సపోర్ట్ చేసిన బండ్లగణేష్.. ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

బ్రహ్మస్త్ర ఈవెంట్ క్యాన్సిల్ అయిన తెల్లారే బండ్ల గణేష్ లవ్ యు కేసీఆర్, మీరు టైగర్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకే బండ్ల గణేష్ అలా ట్వీట్ చేశాడు, బండ్ల గణేష్ పవన్ అభిమాని అంటూ.............

Bandla Ganesh : లవ్ యు అంటూ కేసీఆర్ ని సపోర్ట్ చేసిన బండ్లగణేష్.. ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

NTR Fans Trolled Bandla Ganesh

Bandla Ganesh :  ఇటీవల బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. దీనికి ఎన్టీఆర్ కూడా చీఫ్ గెస్ట్ గా వస్తారని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఈవెంట్ కి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి కారణం పోలీసులు గణేష్ నవరాత్రులు అని చెప్పారన్నారు. కానీ దీనివెనుక రాజకీయ కోణం ఉందని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఇటీవల ఎన్టీఆర్ అమిత్ షాని కలవడం వల్లే ఎన్టీఆర్ కి ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు అని అంటున్నారు. అయితే ఈవెంట్ కి క్యాన్సిల్ కి కారణాలు ఏవైనా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారు. ఎన్టీఆర్ ని చూడలేకపోయాం అనే బాధలో ఉన్నారు. ఈ సమయంలో బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Chiranjeevi Blood Bank : 50 సార్లకుపైగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన వారికి గవర్నర్ సత్కారం..

బ్రహ్మస్త్ర ఈవెంట్ క్యాన్సిల్ అయిన తెల్లారే బండ్ల గణేష్ లవ్ యు కేసీఆర్, మీరు టైగర్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకే బండ్ల గణేష్ అలా ట్వీట్ చేశాడు, బండ్ల గణేష్ పవన్ అభిమాని అంటూ ఫైర్ అవుతూ బండ్ల గణేష్ ని ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ బండ్ల గణేష్ దాకా వెళ్లడంతో ఆ న్యూస్ ని షేర్ చేసి.. లవ్ యు కేసీఆర్, లవ్ యు మా హీరో ఎన్టీఆర్ అంటూ పోస్ట్ చేసి ఎన్టీఆర్ అభిమానులని చల్లబరిచాడు. మొత్తానికి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ట్రెండ్ లో ఉండే బండ్లన్న ఈ సారి ఎన్టీఆర్ అభిమానుల వల్ల ట్రెండ్లోకి వచ్చాడు.