NTR30: మెడికల్ మాఫియా కథాంశంతో ఎన్టీఆర్ కొరటాల సినిమా..

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “NTR30”. సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికి షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో.. ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ బయటకి వస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరో వార్త టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

NTR30: మెడికల్ మాఫియా కథాంశంతో ఎన్టీఆర్ కొరటాల సినిమా..

NTR Koratala movie with medical mafia storyline

NTR30: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “NTR30”. సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికి షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో.. ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ బయటకి వస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరో వార్త టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

NTR30: అసలే లేదంటే.. కొసరు వార్తలతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!

అదేంటంటే ఈ సినిమా కథాంశం మెడికల్ మాఫియా చుట్టు తిరగనుననట్లు తెలుస్తుంది. కార్పొరేట్ వైద్యం, అందులో జరుగుతున్న అక్రమాలను చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘జనతా గారేజ్’ సినిమాలో పర్యావరణ పరిరక్షణ గురించి పోరాడిన తారక్, ఈ సినిమాలో వైద్యంలో జరుగుతున్న అక్రమాలుపై పోరాడనున్నాడు.

తాజాగా డైరెక్టర్ కొరటాల శివ, డిఓపి రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ వారి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పూర్తీ చేయడంతో, త్వరలోనే సినిమా పట్టాలు ఎక్కనుంది అంటూ ప్రకటన చేశారు మూవీ టీం. ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నందమూరి తారక్ రామారావు ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాతంకంగా నిర్మిస్తున్నాడు.