NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NTR30 షూటింగ్ వర్క్స్ స్టార్ట్!

RRR సినిమాతో దేశం మొత్తని ఒక ఊపు ఊపేసిన ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలకు కమ్మిట్ అయ్యాడు. అయితే ముందుగా కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచినప్పటికీ, ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు.

NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NTR30 షూటింగ్ వర్క్స్ స్టార్ట్!

NTR30 Art Works Start

NTR30: RRR సినిమాతో దేశం మొత్తని ఒక ఊపు ఊపేసిన ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలకు కమ్మిట్ అయ్యాడు. అయితే ముందుగా కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచినప్పటికీ, ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు.

NTR30: ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్ పేరు.. ఎవరంటే?

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మునపటి సినిమా ‘ఆచార్య’ ఘోర పరాజయాన్ని అందుకోవడంతో.. తారక్ స్క్రిప్ట్‌పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, దాంతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ అండ్ నిర్మాత కళ్యాణ్ రామ్ లకు సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఓకే కావడంతో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సినిమా షూటింగ్ ఆలస్యం లేకుండా ప్రారంభం అయ్యేలా సెట్ డిజైన్ పనులు ప్రారంభించమని శివని కోరడంతో.. కొరటాల తన ఆర్ట్-డైరెక్షన్ టీంతో బెస్ట్ విజువల్స్ వచ్చేలా బెస్ట్ సెట్‌ను రూపొందించడానికి కూర్చున్నాడు. వచ్చే వారం నుంచి ఈ సెట్స్ నిర్మాణం కూడా మొదలుపెట్టనున్నారట. మరోవైపు, దర్శకుడు క్లైమాక్స్ పార్ట్‌ కోసం ఇద్దరు ప్రముఖ టాలీవుడ్ రచయితలు కలిసి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.