Oh Madhu Movie: విడుదలకు సిద్ధమైన ‘ఓ మధు’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్!

అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏఎమ్ ఖాన్ నిర్మిస్తున్న చిత్రం "ఓ మధు'.

Oh Madhu Movie: విడుదలకు సిద్ధమైన ‘ఓ మధు’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్!

Oh Madhu

Oh Madhu Movie: బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏఎమ్ ఖాన్ నిర్మిస్తున్న చిత్రం “ఓ మధు’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లేటెస్ట్‌గా ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి వచ్చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి చేతులమీదుగా ఓ మధు చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన విడుదల కానుంది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషనల్ ఎస్‌పీ లక్ష్మణ్.. తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగా వచ్చిందని, మా ముందు పుట్టి పెరిగిన అబ్బాయి ఈరోజు హీరోగా ఎదగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తల్లి కోరిక తన కొడుకు డాక్టర్ కావాలని, తండ్రి కోరిక యాక్టర్ అవ్వాలని అందుకే హీరో డాక్టర్‌గా, యాక్టర్‌గా రాణించి తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చాలని కోరుతున్నాను.

మాజీ ఎమ్మెల్యే నగేష్ మాట్లాడుతూ.. సినీ నేపథ్యం ఉన్నవాళ్లే సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కాలుపెట్టడానికి చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఎటువంటి సినిమా నేపథ్యం లేని ఏఎమ్ ఖాన్ ఈరోజు ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఖాన్ కొడుకు ఈరోజు హీరో అవ్వడం చాలా సంతోషం అన్నారు.

బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌తో హార్రర్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అందరూ ఆకాక్షించారు. ఈ సినిమాలో అబ్రార్ ఖాన్, ఐశ్వర్య, వాజిద్ ఖాన్, ఖలీల్ జాంబియా తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జితేందర్ రెడ్డి పనిచేశారు.