Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం.. వచ్చేది అప్పుడే!

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల సరైన హిట్ లేక బాక్సాఫీస్ వద్ద వెనకబడిపోయాడు. ఈ హీరో నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలుస్తుండటంతో శర్వా నుండి రాబోయే నెక్ట్స్ మూవీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రతిసారి ఆడియెన్స్‌లలో నెలకొంటుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా మూవీ ‘ఒకే ఒక జీవతం’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం.. వచ్చేది అప్పుడే!

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల సరైన హిట్ లేక బాక్సాఫీస్ వద్ద వెనకబడిపోయాడు. ఈ హీరో నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలుస్తుండటంతో శర్వా నుండి రాబోయే నెక్ట్స్ మూవీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రతిసారి ఆడియెన్స్‌లలో నెలకొంటుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా మూవీ ‘ఒకే ఒక జీవతం’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ కథతో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ శర్వాతో రొమాన్స్ చేయనుండగా, అమలా అక్కినేని ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కాగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొనగా, తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Oke Oka Jeevitham : జీవితానికి, టైం మిషన్‌కి సంబంధం ఏంటి?

ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. రిలీజ్ డేట్ టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను శ్రీ కార్తిక్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.