Pawan Kalyan Birthday : న్యూయార్క్ టైంస్క్వేర్ వద్ద పవన్ కళ్యాణ్ బర్త్ డే.. ఈ స్పెషల్ వీడియో చూశారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక బయట విదేశాల్లో ఉన్న పవన్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు.

Pawan Kalyan Birthday : న్యూయార్క్ టైంస్క్వేర్ వద్ద పవన్ కళ్యాణ్ బర్త్ డే.. ఈ స్పెషల్ వీడియో చూశారా?

Pawan Kalyan Birthday Video play at New york Times square video goes viral

Pawan Kalyan Birthday :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అభిమానులంతా గ్రాండ్ గా చేసుకుంటారని తెలిసిందే. నిన్న సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులతో పాటలు జనసేన కార్యకర్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. అభిమానులు సోషల్ మీడియాలో, బయట హంగామా చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక బయట విదేశాల్లో ఉన్న పవన్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. అమెరికాలో(America) పవన్ అభిమానులు ఏకంగా న్యూయార్క్ టైం స్క్వేర్(New York Time Square) వద్ద పవన్ బర్త్ డే వేడుకల్ని నిర్వహించారు. అంతేకాక న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ వీడియోని ప్లే చేశారు.

Pawan Kalyan OG : సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ OG ? పండక్కి వస్తాడా?

న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద వీడియో ప్లే అవ్వాలని చాలా మంది నటీనటులు, మోడల్స్ కోరుకుంటారు. న్యూయార్క్ లో ప్రఖ్యాత ప్లేస్ అయిన టైం స్క్వేర్ వద్ద మన ఇండియన్స్ ఇటీవల తమ అభిమాన హీరోల స్పెషల్ డేస్, మన పండగలకు వీడియోలు ప్లే చేసి అభిమానం తెలుపుతున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియోని ప్లే చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.