Prabhas Maruthi Movie Launched: మారుతితో సైలెంట్‌గా మొదలుపెట్టిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హిట్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందనే వార్త గతకొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మారుతి ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.కాగా, మారుతి అండ్ టీమ్ చడీచప్పుడు లేకుండా ప్రభాస్‌తో సినిమాను ఇవాళ ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభించారు.

Prabhas Maruthi Movie Launched: మారుతితో సైలెంట్‌గా మొదలుపెట్టిన ప్రభాస్

Prabhas Maruthi Movie Launched With Formal Pooja`

Prabhas Maruthi Movie Launched: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హిట్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందనే వార్త గతకొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మారుతి ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందా అనే చర్చ తీవ్రంగా నడిచింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.

Prabhas : స్పిరిట్ సినిమాని సైడ్ చేసిన ప్రభాస్

కాగా, మారుతి అండ్ టీమ్ చడీచప్పుడు లేకుండా ప్రభాస్‌తో సినిమాను ఇవాళ ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్‌కు సంబంధించిన కొందరు మాత్రమే హాజరయ్యారు. ఇక ప్రభాస్ కూడా ఈ పూజా కార్యక్రమానికి రాలేకపోయాడు. ఇలా సైలెంట్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో లేకుండానే పూజా కార్యక్రమం నిర్వహిస్తారా అవి వారు అంటున్నారు.

Prabhas: బ్రేక్‌లోనే కానిచ్చేస్తానంటోన్న ప్రభాస్!

అయితే ఈ సినిమాను మారుతి తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ మూవీలో అందాల భామ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభమినులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.