Salaar : ప్రభాస్ అభిమానులకు గట్టి షాక్.. 2023లో సలార్ రావడం లేదట..

సలార్ టీం ప్రభాస్ అభిమానులకు గట్టి షాక్ ఇవ్వబోతున్నారా. ఈ మూవీ రిలీజ్ ని వచ్చే ఏడాది..

Salaar : ప్రభాస్ అభిమానులకు గట్టి షాక్.. 2023లో సలార్ రావడం లేదట..

Prabhas Salaar makers plan release on 2024 sankranthi or summer

Salaar : ప్ర‌భాస్ (Prabhas) ‘సలార్’ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా రాలేదు. ప్రభాస్ కూడా మాస్ పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్టుపోన్ అయ్యి అభిమానులను నిరాశ పరిచిన విషయం అందరికి తెలిసిందే. ఇక కొత్త డేట్ కోసం అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Shruti Haasan : హీరోయిన్ శృతి హాసన్ వెంట‌ బాడీగార్డ్స్‌ ఎందుకు ఉండ‌రో తెలుసా..?

ఈ మూవీ నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కొన్ని రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఫిలిం వర్గాల్లో ఒక షాకింగ్ న్యూస్ హల్ చల్ అవుతుంది. ఈ సినిమా అసలు 2023లో రావడం లేదని చెబుతున్నారు. కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేస్తారని, అది కుదరపోతే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఈ సినిమా షిఫ్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ వార్తలతో ప్రభాస్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ నెలలో వచ్చేస్తుంది అనుకున్న సినిమా వచ్చే ఏడాది మిడ్ కి వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ టీం వార్నింగ్ నోట్.. ఇక నుంచి అలా చేస్తే..

మరి ఈ వార్తలు పై మూవీ టీం ఏమన్నా క్లారిటీ ఇస్తుందా? లేదా? చూడాలి. కాగా ఈ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రుతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), జగపతి బాబు (Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది. ఈ మూవీ రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ టైటిల్ తో రిలీజ్ కాబోతుంది.