Sandeep Vangaa : బాలీవుడ్ డైరెక్టర్ కోసం టాలీవుడ్ డైరెక్టర్ ని పక్కన పెట్టేయనున్న ప్రభాస్..?

 ప్రభాస్ ఆదిపురుష్ తో వచ్చే సంక్రాంతికి వస్తున్నాడు, సలార్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కి రానుంది. ఇక ప్రాజెక్టు K షూటింగ్ జరుగుతుంది. రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డితో ఒక సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ఒక సినిమా...........

Sandeep Vangaa : బాలీవుడ్ డైరెక్టర్ కోసం టాలీవుడ్ డైరెక్టర్ ని పక్కన పెట్టేయనున్న ప్రభాస్..?

Prabhas Sandeep Vangaa movie Spirit gets some more delay

Sandeep Vangaa :  ప్రభాస్ ఆదిపురుష్ తో వచ్చే సంక్రాంతికి వస్తున్నాడు, సలార్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కి రానుంది. ఇక ప్రాజెక్టు K షూటింగ్ జరుగుతుంది. రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డితో ఒక సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ఒక సినిమా, ఈ మధ్యలో మారుతితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ మూడు సినిమాల తర్వాత సందీప్ వంగాతో చేయాల్సిన స్పిరిట్ సినిమాకి మరింత గ్యాప్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

సందీప్ రెడ్డి ప్లేస్ లోకి బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ రానున్నాడు. వార్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ డైరెక్టర్ ప్రజెంట్ షారూఖ్ తో పఠాన్ సినిమా, హృతిక్ తో ఫైటర్ సినిమాలు చేస్తున్నాడు. పఠాన్ జనవరిలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత హృతిక్ ఫైటర్ కంప్లీట్ చేసి ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు. ఈ లోపు ప్రభాస్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఈ డైరెక్టర్ తో షూట్ కి వెళ్లనున్నాడు. అయితే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో 25వ సినిమా అని చెప్పి దాన్ని అసలు పట్టించుకోవడంలేదు ప్రభాస్. లిస్ట్ లో మళ్ళీ వెనక్కి వెళ్లినట్టు తెలుస్తుంది.

Allu Aravind : చిరంజీవి దేవుడు.. బన్నీని చిరంజీవి కొడుకులా చూసుకుంటాడు..

సందీప్ ప్రస్తుతం రణవీర్ సింగ్ తో యానిమల్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమాపై వర్క్ మొదలుపెడతాడు. సినిమాల లెక్క చూసుకున్నా సిద్దార్థ్ ఆనంద్ కంటే ముందే సందీప్ వంగా ఫ్రీ అవుతాడు. మరి ప్రభాస్ సందీప్ ని పక్కన పెట్టి సిద్దార్థ్ సినిమాని ఎందుకు లైన్లోకి తెస్తున్నాడో అర్ధం కావట్లేదు. దీంతో సందీప్ – ప్రభాస్ స్పిరిట్ సినిమా మరింత ఆలస్యం అవ్వనున్నట్టు తెలుస్తోంది.