Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ స్పెషల్ గ్లింప్స్ ఇవాళ రాబోతుంది.. రెడీగా ఉండండి!

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన ప్రజాధారణ సంపాదించుకుంది. ఇక ఈ టాక్ షో కొత్త ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నాడు. తాజాగా ఈ ఎపిసోడ్...

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ స్పెషల్ గ్లింప్స్ ఇవాళ రాబోతుంది.. రెడీగా ఉండండి!

Prabhas Unstoppable episode special glimpse coming today

Prabhas : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన ప్రజాధారణ సంపాదించుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణని వ్యాఖ్యాతగా పెట్టి.. సినీ, రాజకీయ ప్రముఖులను గెస్ట్‌లుగా తీసుకు వస్తూ, వారి జీవితంలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకు తెలియజేస్తూ అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు షో నిర్వాహకులు.

Prabhas in Unstoppable Show : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్..

ఇక ఈ టాక్ షో కొత్త ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను నిన్న విడుదల చేయగా, అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ ఎపిసోడ్ స్పెషల్ గ్లింప్స్ ని ఇవాళ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది ఆహా టీమ్. అయితే ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేదు.

దీంతో డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియాని రెప్ప వెయ్యకుండా గమనిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో హైయెస్ట్ వ్యూస్ తో నెంబర్ వన్ గా నిలిచింది. మరి ఇప్పుడు పాన్ ఇండియా రాకతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. కాగా ప్రభాస్ ఈ ఎపిసోడ్ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో పాటు మొత్తం అన్‌స్టాపబుల్ టీమ్ కి అదిరిపోయే విందుని ఏర్పాటు చేసాడట.