Puri Jagannadh : పోకిరి, బిజినెస్ మ్యాన్ సీక్వెల్స్ తీస్తాను.. పూరి జగన్నాధ్ ప్రకటన.. ఫుల్ జోష్ లో మహేష్ ఫ్యాన్స్..

లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న పూరి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాల గురించి మాట్లాడారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ''మాకు బిజినెస్ మ్యాన్ సినిమాని హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉంది. త్వరలోనే దాని గురించి ఆలోచిస్తాను. గతంలోనే పోకిరి, బిజినెస్ మ్యాన్...............

Puri Jagannadh : పోకిరి, బిజినెస్ మ్యాన్ సీక్వెల్స్ తీస్తాను.. పూరి జగన్నాధ్ ప్రకటన.. ఫుల్ జోష్ లో మహేష్ ఫ్యాన్స్..

Puri Jagannadj announce Pokiri and Businessman Movie Sequels

Puri Jagannadh :  హీరోలని డిఫరెంట్ గా, కొత్తగా, ఫుల్ మాస్ క్యారెక్టర్స్ లో చూపించాలంటే పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. పూరి సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా హీరో క్యారెక్టర్ మాత్రం ఎప్పటికి నిలిచిపోతుంది. ప్రభాస్, మహేష్, రామ్, పవన్ కళ్యాణ్, చరణ్.. లాంటి ఎంతోమంది స్టార్ హీరోలని మాస్ హీరోలుగా తీర్చిదిద్దింది పూరి జగన్నాథే. ప్రతి హీరో అభిమాని తమ హీరో పూరితో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటాడు.

పూరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మహేష్ తో చేసిన పోకిరి. మహేష్ కెరీర్ లో కూడా భారీ విజయం సాధించి మహేష్ ని సూపర్ స్టార్ గా మార్చేసిన సినిమా పోకిరినే. వీరిద్దరి కాంబినేషన్ లో ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఈ రెండు సినిమాల్లో మహేష్ క్యారెక్టరయిజేషన్ చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ప్రేక్షకులకి కూడా ఈ రెండు సినిమాలు నచ్చేశాయి. ఇటీవలే పోకిరి రీరిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా రికార్డులు సృష్టించింది. చాలా మంది మహేష్ ఫ్యాన్స్ మళ్ళీ పూరితో తమ హీరో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నారు. లేదా పోకిరి, బిజినెస్ మ్యాన్ సీక్వెల్స్ అయినా తీయండి అంటూ అడుగుతున్నారు.

Tharun Bhascker new movie Opening : ఘనంగా తరుణ భాస్కర్ కొత్త సినిమా ‘కీడా కోలా’ ఓపెనింగ్

తాజాగా పూరి జగన్నాధ్ దీనిపై స్పందించాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న పూరి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాల గురించి మాట్లాడారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ”మాకు బిజినెస్ మ్యాన్ సినిమాని హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉంది. త్వరలోనే దాని గురించి ఆలోచిస్తాను. గతంలోనే పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలకి సీక్వెల్స్ చేద్దాం అని నేను, మహేష్ గారు అనుకున్నాము. కానీ మాకున్న వేరే సినిమాల కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. నాకు ఆ రెండు సినిమాల్లోని పండుగాడు, సూర్య భాయ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. అన్నీ కలిసొస్తే, మహేష్ గారు కూడా ఒప్పుకుంటే కచ్చితంగా పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలకి సీక్వెల్స్ తీస్తాను. కానీ అది ఎప్పుడు జరుగుతుందో మాత్రం చెప్పలేను” అని తెలిపారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వీళ్లిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రావాలని కోరుకుంటున్నారు.