Pushpa: ‘ఆర్ఆర్ఆర్’ బాటలోనే పుష్ప పయనం.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన మూడో చిత్రం "పుష్ప". గత ఏడాది డిసెంబర్ లో విడుదలయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అఖండమైన విజయాన్ని అందుకుంది. 'తగ్గేదేలే' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రపంచం మొత్తని ఒక ఊపు ఊపేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసిన మేకర్స్, 'ఆర్ఆర్ఆర్' మాదిరి పుష్పని కూడా ఇతర భాషల్లో విడుదల చేసి 'పుష్ప ది రూల్' మార్కెట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...

Pushpa: ‘ఆర్ఆర్ఆర్’ బాటలోనే పుష్ప పయనం.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

Pushpa's journey on the path of RRR

Pushpa: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన మూడో చిత్రం “పుష్ప”. గత ఏడాది డిసెంబర్ లో విడుదలయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అఖండమైన విజయాన్ని అందుకుంది. ‘తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రపంచం మొత్తని ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, ఈ నెల నుంచి సెకండ్ పార్ట్ ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణ జరుపుకోనుంది.

Pushpa 2: గ్లోబల్ మూవీ సీక్వెల్‌తో పుష్ప సీక్వెల్ బ్యాంగ్.. మామూలు స్కెచ్ కాదుగా!

కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసిన మేకర్స్, ‘ఆర్ఆర్ఆర్’ మాదిరి పుష్పని కూడా ఇతర భాషల్లో విడుదల చేసి ‘పుష్ప ది రూల్’ మార్కెట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యాలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రష్యా సినిమా ప్రమోషన్స్ కు అల్లు అర్జున్ కూడా వెళ్లనున్నాడట. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లువిడలేదు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు పుష్ప అభిమానులు. దీంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తులు తీసుకుంటున్నాడట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు.