Raashii Khanna : సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా ఏం పాడింది భయ్యా.. ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్..
సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా తెలుగు, తమిళ్, హిందీ లిరిక్స్ తో మెలోడీ సాంగ్ పాడి అదరగొట్టింది.
![Raashii Khanna : సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా ఏం పాడింది భయ్యా.. ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్.. Raashii Khanna : సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా ఏం పాడింది భయ్యా.. ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్..](https://10tv.in/wp-content/uploads/2023/08/Raashii-Khanna-tribute-of-Sai-Dharam-Tej-The-Soul-Of-Satya-song.jpg)
Raashii Khanna tribute of Sai Dharam Tej The Soul Of Satya song
Raashii Khanna : అందాల భామ రాశి ఖన్నా.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తరువాత తెలుగుతో పాటు సౌత్ లోని పలు భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. రాశి తన యాక్టింగ్ తో మాత్రమే కాదు తన వాయిస్ తో కూడా అభిమానులను సంపాదించుకుంటూ వచ్చింది. పలు తెలుగు సినిమాల్లో పాటలు పాడి ఆడియన్స్ ని అలరించింది. తాజాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కోసం ఒక పాట పాడి అదరగొట్టింది.
Mega Heroes : ఈ ఫొటోల్లో ఉన్న మెగాహీరోలు ఎవరో గుర్తుపట్టారా..? అలాగే పిక్ ఏ టైంలో తీసిందో తెలుసా..?
సాయి ధరమ్ ‘సత్య’ అనే షార్ట్ ఫీచర్ ఫిలింలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. శృతి రంజని సంగీతం అందిస్తూ పాటని పాడింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాటని రాశిఖన్నా తన స్వరంలో మళ్ళీ పాడి సాయి ధరమ్ తేజ్ కి గిఫ్ట్ ఇచ్చింది. రెండు నిమిషాలు ఉన్న సాంగ్ లో తెలుగు, తమిళ్, హిందీ లిరిక్స్ ని కలిపి పాట పాడి అదరగొట్టింది. ఈ సాంగ్ ని రిలీజ్ చేయగా, రాశి ఖన్నా వాయిస్ విన్న నెటిజెన్స్.. “ఏం పాడింది భయ్యా, ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా వినేయండి.
సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 23 నిముషాలు పాటు ఉండే ఈ ఫిలింలో 6 నిముషాలు సాంగ్ ఉంటుంది. దేశసరిహద్దుల్లో దేశం కోసం ప్రాణం ఇచ్చే సైనికుల మాత్రమే కాదు, వారి భార్యలు కూడా తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనే దాని పై ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. సాయి ధరమ్ సైనికుడు కూడా కనిపిస్తుంటే అతడి భార్యగా కలర్ స్వాతి (Swathi Reddy) నటించింది.