Rajinikanth : జైలర్ సినిమా నాకు ఎబోవ్ యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సినిమాకు పనిచేసిన వారందరికీ సక్సెస్ షీల్డ్ లతో పాటు ఒక బంగారు నాణెం కూడా ఇచ్చారు నిర్మాత. ఈ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ..

Rajinikanth : జైలర్ సినిమా నాకు ఎబోవ్ యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

Rajinikanth sensational comments on Jailer Movie Result in Success Meet

Rajinikanth :  ఇటీవల రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి జైలర్ సినిమా రజిని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా హిట్ అయ్యాక నిర్మాత కళానిధి మారన్(Kalanithi Maran) హీరో రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చారు.

ఇటీవల సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సినిమాకు పనిచేసిన వారందరికీ సక్సెస్ షీల్డ్ లతో పాటు ఒక బంగారు నాణెం కూడా ఇచ్చారు నిర్మాత.

Sara Ali Khan : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో హీరోయిన్ ఫిక్స్?.. పూరి ఖాతాలో ఈసారి కూడా మరో బాలీవుడ్ భామ..

ఈ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ.. ఒక సినిమా మంచి విజయం సాధిస్తే ఆర్టిస్టులని, టెక్నిషియన్స్ ని ఎలా గౌరవించాలో కళానిధి మారన్ కి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయన సినిమా హిట్ అవుతుందని చెప్తూనే ఉన్నారు. సినిమా రీ రికార్డింగ్ ముందు కళానిధి అక్కడ ఉన్న కొంతమందిని సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుంది, హిట్ అవుతుందని చెప్పారు. ఇంకొకరు యావరేజ్ అన్నారు. నిజం చెప్పాలంటే జైలర్ సినిమా నాకు కూడా ఎబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ రీ రికార్డింగ్ మొత్తం అయ్యాక, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అనిరుధ్ నా కొడుకు లాంటివాడు. నాకు హిట్ ఇచ్చాడు, అతని ఫ్రెండ్ నెల్సన్ కి హిట్ ఇచ్చాడు అని అన్నారు. దీంతో రజిని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.