Sapta Sagaralu Dhaati : సప్త సాగరాలు దాటి.. సైడ్ B వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సారి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

Sapta Sagaralu Dhaati : సప్త సాగరాలు దాటి.. సైడ్ B వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..

Rakshit Shetty Sapta Sagaralu Dhaati Side B Movie Releasing Date Announced

Sapta Sagaralu Dhaati : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ అక్కడ హిట్ అవ్వగా ఆ తర్వాత తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో రిలీజ్ చేశారు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా నటించింది. హేమంత్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. .

ఒక మిడిల్ క్లాస్ కొత్తగా పెళ్లయిన జంట(హీరో – హీరోయిన్) చిన్న జాబ్స్ చేసుకుంటూ సిటీలో బతుకుతుంటారు. ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని హీరో డబ్బుల కోసం ఒప్పుకొని త్వరగా బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని హీరోయిన్ ఒప్పుకోకపోయినా జైలుకి వెళ్తాడు. కానీ కేసు ఒప్పుకోమని ఇచ్చిన వాళ్ళు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హీరో పదేళ్లు జైలులోనే ఉండాల్సి వస్తుంది. ఈ కథని పార్ట్ 1 సైడ్ A అంటూ అందంగా, ఎమోషనల్ గా చూపించారు. ఆ తర్వాత హీరో జైలు నుంచి బయటకి వచ్చి ఏం చేశాడు అనేది పార్ట్ 2 లో చూడాలి.

Also Read : Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ.. రాక్షసుడా? రాముడా?

తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సారి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 17న థియేటర్స్ లోకి రానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.