Rambha : నా కూతురు సాషా క్షేమంగానే ఉంది.. మీ అందరికి రుణపడి ఉంటాను..

రంభ లైవ్ లో మాట్లాడుతూ.. ''మొదటిసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం, నా కూతురి కోసం ప్రార్థించిన నా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ...............

Rambha : నా కూతురు సాషా క్షేమంగానే ఉంది.. మీ అందరికి రుణపడి ఉంటాను..

Rambha gives clarity on her daughter health

Rambha :  ఇటీవల సీనియర్ హీరోయిన్ రంభ కారుకి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. తన పిల్లలని స్కూల్ నుంచి తీసుకొస్తుండగా మరో కారు వచ్చి రంభ కారుని గుద్దింది. ఈ ఘటనలో రంభ, మరో ఇద్దరికీ చిన్న చిన్న గాయాలు అవ్వగా రంభ కూతురు సాషా మాత్రం తీవ్రంగా గాయపడింది.

రంభ ఈ ఘటన గురించి తెలిపి తన కూతురు హాస్పిటల్ లో చికిత్స పొందుతుందని, తన కోసం ప్రార్ధించమని వేడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా రంభ మొదటి సారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చింది. తన కూతురు ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చింది.

PS Mithran : సర్దార్ హిట్.. డైరెక్టర్ కి కారు..

రంభ లైవ్ లో మాట్లాడుతూ.. ”మొదటిసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం, నా కూతురి కోసం ప్రార్థించిన నా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు నా కుటుంబం క్షేమంగా ఉంది. నా కూతురు సాషా కూడా క్షేమంగా ఉంది. తనను ఇవాళే ఇంటికి తీసుకొచ్చాం. మా మీద ఇంత అభిమానం చూపించిన మీ అందరికి ధన్యవాదాలు” అని తెలిపింది.