Rambha : రంభ కారుకి యాక్సిడెంట్.. హాస్పిటల్‌లో రంభ కూతురు.. మా కోసం ప్రార్ధించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

రంభ తన పిల్లలతో కలిసి వస్తుంటే మరో కారు వచ్చి రంభ కారుని గుద్దేసింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. రంభ తన సోషల్ మీడియాలో కార్ యాక్సిడెంట్ ఫోటోలు షేర్ చేసి..........

Rambha : రంభ కారుకి యాక్సిడెంట్.. హాస్పిటల్‌లో రంభ కూతురు.. మా కోసం ప్రార్ధించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

Rambha's car met with an accident

Rambha :  ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఉన్న రంభ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీతో లైఫ్ ని లీడ్ చేస్తుంది. సినిమాలకి దూరంగా ఉన్నా సినీ పరిశ్రమతో మాత్రం మంచి స్నేహం కొనసాగిస్తోంది. తాజాగా రంభ కారుకి యాక్సిడెంట్ అయింది.

Nysa Devgan : హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న మరో బాలీవుడ్ స్టార్ కిడ్..??

రంభ తన పిల్లలతో కలిసి వస్తుంటే మరో కారు వచ్చి రంభ కారుని గుద్దేసింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. రంభ తన సోషల్ మీడియాలో కార్ యాక్సిడెంట్ ఫోటోలు షేర్ చేసి.. మా పిల్లలని స్కూల్ నుండి తీసుకువస్తుంటే మరో కార్ వచ్చి గుద్దేసింది. మా కార్ కి యాక్సిడెంట్ అయింది. మేమందరం చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం కానీ నా కూతురు సాషా ఇంకా హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకుంటుంది. ఇవాళ మాకు బ్యాడ్ డే, బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంట. మా కోసం ప్రార్ధించండి” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో రంభ కూతురు త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు.