RGV : అషు రెడ్డి పాదాలను ముద్దాడుతున్న RGV.. వైరల్ అవుతున్న వీడియో..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన సెన్సేషన్ అవ్వాల్సిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ, బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి పాదాలను ముద్దాడుతూ..

RGV : అషు రెడ్డి పాదాలను ముద్దాడుతున్న RGV.. వైరల్ అవుతున్న వీడియో..

RGV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన సెన్సేషన్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కించిన ‘డేంజరస్’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ‘మా ఇష్టం’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు వర్మ.

RGV : బాలకృష్ణ షోలో ఆర్జీవీని పొగిడిన సురేష్ బాబు..

ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అషు రెడ్డితో ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డి కూర్చులో కూర్చొని ఉండగా, RGV ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఉండడం విశేషం. ఇక ఈ ఇంటర్వ్యూ చివరిలో వర్మ.. నీ కాలుని ముద్దు పెట్టుకోవాలని ఉందంటూ, ముద్దు పెట్టుకొనే వరప్రసాదం ఇవ్వాలంటూ అషు రెడ్డినీ కోరాడు.

దీంతో ఆమె.. “ఇంతసేపు నా పదాలు దగ్గర ఒక భక్తుడిలా కూర్చొని నన్ను దేవతల ట్రీట్ చేసిన నీ కోరిక తీర్చకుండా ఉంటానా” అంటూ అషు రెడ్డి బదులివ్వడం. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ ఆమె కాలుని ముద్దాడడం నెట్టింట వైరల్ గా మారింది.