Sai Pallavi : హీరోయిన్స్‌లలో సాయిపల్లవి వేరయా..

సుకుమార్ అన్నట్టు ఛరిష్మా విషయంలో ఆమె ప్రస్తుతం లేడీ పవన్ కల్యాణ్. ఫ్యాన్స్ హృదయంలో సాయి పల్లవి లేడీ సూపర్ స్టార్. కేవలం గ్లామర్ క్యారెక్టర్స్ తోనే ఇండస్ట్రీలో పాపులారిటీ..............

Sai Pallavi :  హీరోయిన్స్‌లలో సాయిపల్లవి వేరయా..

Sai Pallavi (1)

Sai Pallavi :   హీరోయిన్లలో సాయి పల్లవి లెవలే వేరు అని అనిపించుకుంటుంది ఇటీవల కాలంలో. మొదటి నుంచి సాయి పల్లవికి ఫ్యాన్స్ ఎక్కువే. ఎక్కడికెళ్తే అక్కడ తానే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతున్నారు. జనరల్ గా ఓ హీరోకి మాత్రమే హై రేంజ్ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. కానీ సాయిపల్లవి ఆ థియరీని మార్చేసింది. ఎక్కడ సాయి పల్లవి ఉంటే అక్కడ ఆమె అభిమానులు రచ్చ చేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఆమెది. ఒకపక్క స్టార్ హీరోయిన్స్ సైతం గ్లామర్ షో చేసి అభిమానులని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తున్నారు. కానీ సాయి పల్లవి గ్లామర్ తో కాదు సింపుల్ స్మైల్, యాక్టింగ్ స్టైల్, డాన్సింగ్ స్కిల్స్ అన్నింటికి మించి హీరోయిన్ అనే మెటిరీయల్ కు భిన్నంగా తను ఆలోచించే తీరు ఇంతమంది అభిమానుల్ని సంపాందించిపెట్టింది. టాప్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, సమంతల్లా గ్లామరస్ క్యారెక్టర్స్ చేయదు, కనీసం సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అయినా సరే సోషల్ మీడియాలో ఆమె కోసం నెటిజన్స్ చేసే చర్చలు, చేసే పోస్ట్ లు ఆశ్చర్యం కలిగిస్తాయి.

వర్షం కారణంగా మొన్న విరాటపర్వం ట్రైలర్ లాంచ్ వేడుకకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే మూవీ టీమ్ ప్రేక్షకులతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. సాయిపల్లవి మాట్లాడడం స్టార్ట్ చేశాక జనంలో ఒకటే కేకలు, ఫ్యాన్స్ ప్రేమ వర్షంలో ఆమె తడిసి ముద్దయ్యారు. అన్నింటికి మించి ఎలాంటి ఇగో లేకుండా స్వయంగా రానా ఆమెకు గొడుగుపట్టడం ఓ ప్రత్యేక దృశ్యం. ఇప్పుడే కాదు శ్యామ్ సింగరాయ్, ఆడవాళ్లు మీకు జోహార్లు ఫంక్షన్స్ లో సాయిపల్లవికి ఉన్న స్టార్ డం, పాపులారిటీ చూసి మిగిలినవారు ఆశ్చర్యపోయారు.

Samantha : సమంత మలయాళంలో ఎంట్రీ.. అక్కడ కూడా లేడీ ఓరియెంటెడ్..

సుకుమార్ అన్నట్టు ఛరిష్మా విషయంలో ఆమె ప్రస్తుతం లేడీ పవన్ కల్యాణ్. ఫ్యాన్స్ హృదయంలో సాయి పల్లవి లేడీ సూపర్ స్టార్. కేవలం గ్లామర్ క్యారెక్టర్స్ తోనే ఇండస్ట్రీలో పాపులారిటీ సొంతమంటే సాయిపల్లవి ఆ వేషాలకి చాలా దూరం. ఆమె సెలెక్ట్ చేసుకునే డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆమె బిహేవియర్, మాటల్లో కనబరిచే ఇంటెన్స్, సూపర్బ్ డాన్స్, డబ్బు కోసం వెంపర్లాడకుండా పెద్ద పెద్ద బ్రాండ్ల ప్రమోషన్స్ ను వదులుకోవడం… ఇవెన్నో కాక ఇంకేదో ప్రత్యేక ఆకర్షణ ఆమెను మిగిలిన హీరోయిన్స్ నుంచి సపరేట్ చేసి అభిమానులు ఆరాధించేలా చేస్తోంది. అందుకే ఇప్పుడున్న హీరోయిన్స్ లో సాయిపల్లవి వేరు అంటున్నారు.