Sai Pallavi : పెళ్లి వార్తలపై సాయి పల్లవి ఫైర్.. కావాలనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు..
ఇటీవల సాయి పల్లవి పెళ్లి రూమర్స్ చాలా ఎక్కువయ్యాయి. పెళ్లి రూమర్స్ వస్తే పర్వాలేదు కానీ ఒక అబ్బాయితో పెళ్లి అయిపోయినట్టు ఒక ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు.
Sai Pallavi Marriage Rumors : కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తన నటన, నెమలి లాంటి నాట్యంతో అందర్నీ మెప్పించి ఫిదా చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా సినిమాలు చేసింది సాయి పల్లవి. అయితే గత కొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో ఏమైంది, సాయి పల్లవి ఎందుకు సినిమాలు చెయ్యట్లేదు అని అంతా ఎదురుచూశారు.
ఇటీవలే ఆ ఎదురు చూపులకు గుడ్ బై చెప్తూ మళ్ళీ వరుస సినిమాలు ఓకే చేస్తుంది సాయి పల్లవి. తమిళ్ లో శివకార్తికేయన్(Siva Karthikeyan) సినిమా, తెలుగులో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన సినిమా చేస్తుంది సాయి పల్లవి. అయితే ఇటీవల సాయి పల్లవి పెళ్లి రూమర్స్ చాలా ఎక్కువయ్యాయి. పెళ్లి రూమర్స్ వస్తే పర్వాలేదు కానీ ఒక అబ్బాయితో పెళ్లి అయిపోయినట్టు ఒక ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు.
అయితే ఆ ఫోటో ఓ సినిమా ఓపెనింగ్ లోది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో సినిమా యూనిట్ అంతా తమిళ సంప్రదాయం ప్రకారం పూల దండాలు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలలో సాయి పల్లవి డైరెక్టర్ రాజ్ కుమార్ పక్కన నిల్చుంది. దీంతో కొంతమంది వీరిద్దరూ మాత్రమే ఉండేట్టు ఫోటోని కట్ చేసి సోషల్ మీడియాలో సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని వైరల్ చేశారు. ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు ఇది నిజమే అనుకోని నమ్మేసి ఆ ఫోటోని మరింత షేర్ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
Also Read : Balakrishna : బాలయ్య బాబు బ్యాగ్ చూశారా? సింహమే సింహాన్ని భుజాన వేసుకుంది..
అసలు ఇలాంటి రూమర్స్ పై అంత తొందరగా స్పందించని సాయి పల్లవి ఈ పెళ్లి రూమర్లపై స్పందిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో.. నేను సాధారణంగా ఇలాంటి రూమర్స్ పట్టించుకోను. కానీ అందులో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉంటే మాట్లాడాలి. నేను చేయబోయే ఒక సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోని కావాలని కట్ చేసి ఉద్దేశపూర్వకంగా డబ్బులిచ్చి మరీ ప్రమోట్ చేశారు. నేను నా వర్క్ గురించి మంచి ప్రకటనలు పంచుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి రూమర్స్ కి వివరణలు ఇచ్చుకోవాల్సి రావడం చాలా నిరుత్సాహపరుస్తుంది నన్ను. కావాలని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా చెడ్డపని అని ఫైర్ అయింది. దీంతో సాయి పల్లవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up.
An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions.
When I have pleasant announcements to share on my work…— Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023