Samantha : సైకిల్ మీద ఆస్ట్రియాలో చక్కర్లు కొడుతున్న సమంత..
ఇటీవలే ఓ వారం రోజుల క్రితం ఆస్ట్రియా దేశానికి వెళ్ళింది సమంత. ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ అక్కడి ప్రదేశాలని ఫోటోలు తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొడుతుంది సమంత.
![Samantha : సైకిల్ మీద ఆస్ట్రియాలో చక్కర్లు కొడుతున్న సమంత.. Samantha : సైకిల్ మీద ఆస్ట్రియాలో చక్కర్లు కొడుతున్న సమంత..](https://10tv.in/wp-content/uploads/2023/09/samantha-3.jpg)
Samantha Enjoying in Austria posted her Cycling Videos Photos
Samantha : ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం అంటూ దేశాలు తిరిగేస్తుంది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఇటు మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత పలు ప్రదేశాలను సందర్శిస్తుంది. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలి, అనంతరం అమెరికా న్యూయార్క్ వెళ్లి మయోసిటిస్ చికిత్స తీసుకుంది.
ఇటీవలే ఓ వారం రోజుల క్రితం ఆస్ట్రియా(Austria) దేశానికి వెళ్ళింది సమంత. ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ అక్కడి ప్రదేశాలని ఫోటోలు తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొడుతుంది సమంత. ఆస్ట్రియాలోని సెల్జ్ బర్గ్ అనే నగరానికి వెళ్లిన సమంత అక్కడ ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది.
Also Read : Hi Nanna : ప్రభాస్తో పోటీ వద్దని ‘హాయ్ నాన్న’ని ముందే తీసుకొస్తున్న నాని.. వెంకీ మామ కూడా తప్పుకుంటాడా?
సైకిల్ తొక్కుతున్న వీడియోలతో పాటు, పలు ఫోటోలు కూడా షేర్ చేసింది సమంత. సరస్సు పక్కన కూర్చొని ప్రకృతిలో సేద తీరుతున్న ఫోటోని షేర్ చేసింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆస్ట్రియాలో జరిగే ఓ బాడీ పెయింటింగ్ కార్యక్రమానికి వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో సమంత షేర్ చేసిన సైక్లింగ్ వీడియో వైరల్ గా మారింది.