Samantha: సమంతపై వస్తున్న ఆ రూమర్ లో నిజంలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆమె పర్సనల్ మేనేజర్

నాగచైతన్యతో విడాకులు అయ్యాక సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడంతో నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది. సమంత...

Samantha: సమంతపై వస్తున్న ఆ రూమర్ లో నిజంలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆమె పర్సనల్ మేనేజర్

Samantha Personal Manager gives Clarity on her Health Rumours

Samantha: నాగచైతన్యతో విడాకులు అయ్యాక సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడంతో నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె నటించిన “యశోద” మూవీ నుంచి ఇటీవల చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ, అందులో సెప్టెంబర్ 9న టీజర్ విడుదల చేస్తునట్టు ప్రకటించింది. అంబులి, ఓర్ ఎరవు వంటి థిల్లర్ సినిమాలను తెరకెక్కించిన హరి-హరీష్ లు ఈ సినిమాకి దర్శకులు.

Samantha Father : చైసామ్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఇది ఒక కథ.. కొత్త అధ్యాయం మొదలు.. సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్..

సమంత నటించిన మరో చిత్రం “శాకుంతలం” కూడా షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని చాల ప్రతిష్ఠాతంకంగా చిత్రీకరిస్తూ నిర్మిస్తున్నాడు. అల్లు ప్రిన్సెస్ “అల్లు అర్హ” ఈ చిత్రంతో వెండితెరకి పరిచయం అవుతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఇక విషయానికి వస్తే సమంత చర్మ వ్యాధి సమస్యలతో బాధపడుతున్నట్టు నెట్టింట ఒక రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదంటూ ఆమె పర్సనల్‌ మేనేజర్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఈ నెలాఖరిలో “ఖుషి” మూవీ కొత్త షెడ్యూల్ లో పాల్గొంటున్నారని వెల్లడించారు. కాగా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవారిపై సమంత లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటూ ఆ ఇంటర్వ్యూ ద్వారా హెచ్చరించారు.