Shannu-Deepu : బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైం కలిసిన షన్ను-దీపు.. దీప్తి సునైనా గురించి గొప్పగా మాట్లాడిన షణ్ముఖ్..

సోషల్ మీడియాలో దీప్తి సునైనా-షణ్ముఖ్ జశ్వంత్ చాలా పాపులర్ జోడి. వీళ్ళ ప్రేమ గురించి అందరికి తెలుసు. కెరీర్ స్టార్టింగ్ కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టినప్పటి నుంచి ఒకర్నొకరు సపోర్ట్ చేసుకుంటూ పైకెదిగారు. బిగ్ బాస్ సమయంలో కూడా ఒకరికి ఒకరు తోడు ఉన్నారు. బిగ్ బాస్ అయిన తర్వాత ...........

Shannu-Deepu : బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైం కలిసిన షన్ను-దీపు.. దీప్తి సునైనా గురించి గొప్పగా మాట్లాడిన షణ్ముఖ్..

Shannu and Deepu meet first time after breakup

Shannu-Deepu :  సోషల్ మీడియాలో దీప్తి సునైనా-షణ్ముఖ్ జశ్వంత్ చాలా పాపులర్ జోడి. వీళ్ళ ప్రేమ గురించి అందరికి తెలుసు. కెరీర్ స్టార్టింగ్ కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టినప్పటి నుంచి ఒకర్నొకరు సపోర్ట్ చేసుకుంటూ పైకెదిగారు. బిగ్ బాస్ సమయంలో కూడా ఒకరికి ఒకరు తోడు ఉన్నారు. బిగ్ బాస్ అయిన తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఇద్దరూ అధికారికంగానే బ్రేకప్ చెప్పుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అప్పట్నుంచి వీరిద్దరూ కలిసి ఎక్కడా కనపడలేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడలేదు కూడా. మళ్ళీ చాలా నెలల తర్వాత వీరిద్దరూ కలిసి ఒక ఈవెంట్ లో కనపడటం, షన్ను దీప్తి గురించి మాట్లాడటంతో వీరిద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇన్ఫినిటీయం మీడియా సంస్థ యూట్యూబ్ క్రియేటర్స్ డేని వైజాగ్ లో ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ కి ఆ మీడియా సంస్థలో ఉన్న యూట్యూబర్స్ అంతా వచ్చారు. ఇందులో భాగంగానే వైజాగ్ లో జరిగిన ఈ ఈవెంట్ కి దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ ఇద్దరూ వచ్చారు.

Anna Rajan : స్టార్ హీరోయిన్ కి చేదు అనుభవం.. షోరూం లోపల ఉంచి తాళం వేసేసిన సిబ్బంది..

వీరిద్దరూ ఒకర్నొకరు చూసుకోవడం, రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించుకోవడం, ఈ సంస్థ అధినేత మధ్యలో కూర్చొని అటు ఇటు షన్ను, దీపుని కుర్చోబెట్టుకొని మాట్లాడటం, షన్ను దీప్తిని మధ్య మధ్యలో చూస్తూ ఉండటం, ఒకర్నొకరు చూసుకోవడం.. ఇవన్నీ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ మళ్ళీ కలిసిపోతే బాగుండు అని అనుకుంటున్నారు.

వీరిద్దరూ ఒకే ఈవెంట్ లో కనపడటం మాత్రమే కాదు ఈ ఈవెంట్ లో షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుతూ దీప్తి సునైనా గురించి పొగడటం విశేషం. షణ్ముఖ్ దీప్తి గురించి మాట్లాడుతూ.. ”మొదట్లో నేను, దీప్తి సునైనా కవర్‌ సాంగ్స్‌ చేసేటప్పుడు చాలా నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. దీప్తి మీద చాలా ట్రోల్స్‌ వచ్చాయి. కానీ అవన్నీ చూసి దీప్తి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు అందరూ కూడా దీప్తీని చూసి నేర్చుకోవాలి. దీప్తిని ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్ అవ్వాలి” అని మాట్లాడాడు. షన్ను దీప్తి గురించి మాట్లాడటంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే దీప్తి మాత్రం షన్ను గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

shanmukh deepthi sunaina