SJ Surya : పవన్‌కి హిట్ ఇచ్చాను.. మహేష్‌కి హిట్ ఇవ్వలేకపోయాను.. ఎప్పటికైనా మళ్ళీ మహేష్‌తో సినిమా చేస్తా..

దర్శకుడు SJ సూర్య పవన్ అభిమానులకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఖుషి సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ విజయం సాధించి పవన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా SJ సూర్య నాని సినిమా తీశాడు. ఈ సినిమా..........

SJ Surya : పవన్‌కి హిట్ ఇచ్చాను.. మహేష్‌కి హిట్ ఇవ్వలేకపోయాను.. ఎప్పటికైనా మళ్ళీ మహేష్‌తో సినిమా చేస్తా..

SJ Surya comments on mahesh nani movie failure

SJ Surya :  దర్శకుడు SJ సూర్య పవన్ అభిమానులకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఖుషి సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ విజయం సాధించి పవన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా SJ సూర్య నాని సినిమా తీశాడు. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. సినిమా కూడా పర్వాలేదనిపించినా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. అయితే SJ సూర్య ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్నాడు.

SJ సూర్య నటించిన ‘వదంది’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని సినిమా గురించి మాట్లాడాడు. SJ సూర్య మాట్లాడుతూ.. ”మహేష్ గారితో చేసిన నాని సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. సినిమా రిజల్ట్ తర్వాత మహేష్ గారు నాతో.. మీరు సినిమాకి చాలా కష్టపడ్డారు. ఫలితం పక్కన పెడితే నాకు మీ వర్క్ నచ్చింది. మీరు ఈ సినిమాని చాలా ఇష్టపడి చేశారు అని అన్నారు. ఆ మాటతో నాకు ఇంకా బాధ ఎక్కువైంది.”

Prashanth Varma : క్షమాపణలు కోరిన ప్రశాంత్ వర్మ.. పొగిడేస్తున్న నెటిజన్లు..

”పవన్ కళ్యాణ్ గారికి ఖుషి హిట్ సినిమా ఇచ్చాను. కానీ మహేష్ గారికి హిట్ ఇవ్వలేకపోయాను. ప్రస్తుతం నేను నటుడిగా బిజీగా ఉన్నాను. నా యాక్టింగ్ పిచ్చి తగ్గిపోయాక మళ్ళీ దర్శకుడిగా సినిమాలు చేస్తాను. అప్పుడు ఫస్ట్ మహేష్ గారిని ఒప్పించి ఆయనతో ఇంకో సినిమా చేసి కచ్చితంగా హిట్ ఇస్తాను” అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి మహేష్ SJ సూర్యకి డేట్స్ ఇస్తాడా చూడాలి. ఇక మహేష్ స్పైడర్ సినిమాలో SJ సూర్య విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.