Uma Maheshwari : విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం.. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య

సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని...........

Uma Maheshwari : విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం.. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య

Uma Maheshwari

Updated On : August 1, 2022 / 4:31 PM IST

Uma Maheshwari :  సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని మృతిచెందినట్లు సమాచారం. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తుంది. మృతుదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఉమామహేశ్వరి ఇంటికి తరలి వస్తున్నారు.

Naga Chaitanya : సమంత దారి సమంతది.. నా దారి నాది..

ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. నారా లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ చేరుకున్నారు. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి సమాచారం అందించారు. ఇటీవలే ఉమామహేశ్వర కుమార్తె పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారు. ఉమామహేశ్వరి మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.