Bigg Boss 6 Day 104 : మిడ్ వీక్‌లో బిగ్‌బాస్ ఎలిమినేషన్.. శ్రీ సత్య అవుట్!

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చింది. 15వ వారం వచ్చేసరికి హౌస్‌లో.. రోహిత్‌, శ్రీసత్య, శ్రీహాన్‌, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్‌ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. కాగా బిగ్‌బాస్ ఎలిమినేషన్ ఎప్పుడు వీకెండ్ లోనే జరిగేది. కానీ అందరికి షాక్ ఇస్తూ, బిగ్‌బాస్ మిడ్ వీక్‌ ఎలిమినేషన్ కి తెర లేపాడు. ఈ క్రమంలోనే...

Bigg Boss 6 Day 104 : మిడ్ వీక్‌లో బిగ్‌బాస్ ఎలిమినేషన్.. శ్రీ సత్య అవుట్!

Sri Satya Eliminated from Bigg Boss 6

Bigg Boss 6 Day 104 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చింది. 15వ వారం వచ్చేసరికి హౌస్‌లో.. రోహిత్‌, శ్రీసత్య, శ్రీహాన్‌, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్‌ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం ఇచ్చిన ఛాలెంజ్‌లో రోహిత్‌, శ్రీసత్య నెగ్గి ప్రేక్షకులని ఓట్లు అడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఓట్లు అడిగే అవకాశం ఇచ్చేందుకు హౌస్‌మేట్స్‌కి టాస్క్‌లు ఇవ్వగా.. శ్రీహాన్‌, కీర్తి గెలిచి ఆడియన్స్ తో మాట్లాడారు.

Sri Satya : ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన బిగ్ బాస్ శ్రీ సత్య

శ్రీహన్ మాట్లాడుతూ.. “నా మాటలు, నా యాటిట్యూడ్‌ వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. నా ప్రవర్తన వల్ల బాధపడుతున్నారని తెలిసాక, నేను సరిదిద్దుకున్నాను. రేవంత్‌ ‘టికెట్‌ టు ఫినాలే’ వదిలేయడం వల్ల నాకు వచ్చిందని అందరూ అంటుంటే నాకు బాధగా ఉంది. అనుకోని పరిస్థితిలో బిగ్‌బాస్ కి వచ్చా, ట్రోఫీ గెలవాలనే ఉద్దేశంతోనే ఆట అడా. నాకు ఓటు అడిగే అర్హత ఉందో? లేదో? నాకు తెలియదు. అది ఓట్లు వేసి మేరే నిర్ణయించాలి” అంటూ వెల్లడించాడు.

అలాగే కీర్తి మాట్లాడుతూ.. “నేను బయట ఎలా ఉన్నాను? హౌస్ లో ఎలా ఉన్నాను? ఇన్ని రోజులు మీరు చూశారు. బిగ్‌బాస్ లో నేను అనుకున్న దానికంటే బలంగానే నిలబడ్డ. దానికి కారణం మీరు నన్ను మీ ఇంటి కూతురిలా సపోర్ట్ చేస్తూ రావడమే. భవిషత్తులో కూడా ఇలానే మద్దతిస్తారని అనుకుంటున్నా. ట్రోఫీ గెలిస్తే ఆ డబ్బు నా కోసం వాడుకోను, నాలాంటి ఆనాధలు కోసం ఉపయోగిస్తా” అంటూ చెప్పుకొచ్చింది.

కాగా బిగ్‌బాస్ ఎలిమినేషన్ ఎప్పుడు వీకెండ్ లోనే జరిగేది. కానీ అందరికి షాక్ ఇస్తూ.. బిగ్‌బాస్ మిడ్ వీక్‌ ఎలిమినేషన్ కి తెర లేపాడు. ఈ క్రమంలోనే నిన్న సడన్ గా కంటెస్టెంట్స్ అందర్నీ బ్యాగ్‌లు సద్దుకోమని చెప్పి, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని హౌస్‌మేట్స్ ప్రశ్నించాడు బిగ్‌బాస్. దీంతో హౌస్‌లో ఎక్కువమంది కీర్తి పేరు చెప్పారు.

కానీ అందరి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తూ.. ఫినాలేకి వెళుతుంది అనుకున్న శ్రీ సత్యని ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. దీంతో శ్రీ సత్య బ్యాగ్ సర్దుకొని బయటకి వచ్చేసింది. ఎలిమినేట్ అయ్యినందుకు లోలోపల బాధ పడుతున్నా బయటకి ధైర్యంగా ఉన్నట్లు ప్రవర్తించింది శ్రీ సత్య. కానీ రేవంత్‌ మాత్రం ఆమె ఎలిమినేషన్ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.