G.O.A.T Glimpse : మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి.. తరువాత నేనే అంటున్న సుడిగాలి సుధీర్.. గోట్ గ్లింప్స్ అదుర్స్..
సుడిగాలి సుధీర్ తన కొత్త సినిమా G.O.A.T గ్లింప్స్ రిలీజ్ చేశాడు. మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి తరువాత..
![G.O.A.T Glimpse : మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి.. తరువాత నేనే అంటున్న సుడిగాలి సుధీర్.. గోట్ గ్లింప్స్ అదుర్స్.. G.O.A.T Glimpse : మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి.. తరువాత నేనే అంటున్న సుడిగాలి సుధీర్.. గోట్ గ్లింప్స్ అదుర్స్..](https://10tv.in/wp-content/uploads/2023/08/Sudigali-Sudheer-Divya-Bharathi-GOAT-movie-Glimpse-released.jpg)
Sudigali Sudheer Divya Bharathi GOAT movie Glimpse released
G.O.A.T Glimpse : సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తన 4వ సినిమాని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ చిత్రానికి G.O.A.T అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఖరారు చేయగా.. దానికి ‘Greatest Of All Times’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. విశ్వక్ సేన్ తో ‘పాగల్’ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ మూవీ ‘బ్యాచిలర్’తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దివ్య భారతి (Divya Bharathi) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
Vijay Deverakonda : ఖుషి ప్రమోషన్స్‌లో రష్మిక గురించి విజయ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. తనతో కలిసి..!
తాజాగా ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో సుధీర్.. లుంగీ కట్టులో గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని, సిగరెట్ వెలిగిస్తూ పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ గ్లింప్స్ లో ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పాడు. “ఎవడరా నన్ను Fluke అన్నది” అని డైలాగ్ చెప్పాడు. Fluke అంటే ‘లక్ కలిసి వచ్చి ఒక వ్యక్తికి విజయమే ఎదురవ్వడం’ అని అర్ధం. ఇక సుధీర్ ఈ డైలాగ్ చెప్పగానే టైటిల్ పడుతుంది. ఆ టైటిల్లో.. “మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళితో పాటు సుధీర్ ఫోటో వేసి వాళ్ళలా తాను కష్టపడి పైకి వచ్చాను” అని సుధీర్ ఇన్‌డైరెక్ట్ చెప్పినట్లు ఉంది. అయితే గ్లింప్స్ మాత్రం బాగుంది.
Bigg Boss 7 : బిగ్‌బాస్ 7 డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే షురూ.. గెట్ రెడీ
చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ కలిసి లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లియో ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు. గ్లింప్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ కూడా సినిమాకు తగ్గట్టే బాగా ఇస్తున్నట్లు ఇటీవల దర్శకుడు తెలియజేశాడు. శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ షూటింగ్ ని జరుపుతున్నారు.