Suriya : కర్ణుడిగా సూర్య..? బాలీవుడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా..

బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కర్ణ సినిమాలో సూర్య మెయిన్ లీడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

Suriya : కర్ణుడిగా సూర్య..? బాలీవుడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా..

Suriya entry in to Bollywood with Rakesh om Prakash Mehra Karna Movie rumours goes viral

Suriya Movie : తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో, సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. ఇటీవల ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక సౌత్ స్టార్స్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సూర్య నిర్మాతగా బాలీవుడ్ లోకి ఆకాశమే నీ హద్దురా రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

బాలీవుడ్ లో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో కర్ణ ప్రాజెక్టు ఒకటి. మహాభారతంలోని కర్ణుడి కథని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కర్ణ సినిమాలో సూర్య మెయిన్ లీడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ మీడియా అంతా సూర్య బాలీవుడ్ ఎంట్రీ కర్ణ సినిమాతోనే ఉంటుందని అంటున్నారు. రాకేష్ సూర్యతో మాట్లాడగా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Berlin : ‘మనీ హైస్ట్’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘బెర్లిన్’ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్..

అయితే దీనిపై డైరెక్టర్ రాకేష్ కానీ, హీరో సూర్య కానీ అధికారిక ప్రకటన చేయలేదు. ఇక సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సూర్య మరో రెండు ప్రాజెక్టులని ఓకే చేశాడు. మరి ఈ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.