Tamannaah : గతంలోనే పాన్ ఇండియా హీరోయిన్స్ ఉన్నారు.. నా పెళ్లి గురించి నేనే చెప్తాను..

తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో నటిస్తూ నేనెంతగా పరిణతి చెందానో, మా అమ్మానాన్నలు కూడా అంతే పరిణితి చెందారు. అందుకే వాళ్ళు నా పెళ్లి గురించి.........

Tamannaah : గతంలోనే పాన్ ఇండియా హీరోయిన్స్ ఉన్నారు.. నా పెళ్లి గురించి నేనే చెప్తాను..

Tamannaah spoke about her marriage

Tamannaah : ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు అయినా ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు సంపాదిస్తుంది తమన్నా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం బబ్లీ బౌన్సర్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది తమన్నా.

తాజాగా బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది తమన్నా. తమన్నా ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా స్టార్లు అంటున్నారు. కానీ గతంలోనే రేఖ, జయప్రద, శ్రీదేవి… ఇలా చాలా మంది హీరోయిన్స్ అనేక భాషల్లో నటించి పాన్ ఇండియా హీరోయిన్స్ అనిపించుకున్నారు. ఇప్పుడు మేము కూడా అన్ని భాషల్లో చేస్తున్నాము” అని తెలిపింది.

Sharwanand : ఓ చెడ్డ సినిమా తీసి దాన్ని హిట్ అంటే ప్రేక్షకులని మోసం చేయడమే..

ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ”ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో నటిస్తూ నేనెంతగా పరిణతి చెందానో, మా అమ్మానాన్నలు కూడా అంతే పరిణితి చెందారు. అందుకే వాళ్ళు నా పెళ్లి గురించి అడగరు. నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయరు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నేనే ఆనందంగా ఇంట్లో చెప్తాను, మీ అందరికి కూడా చెప్తాను” అని చెప్పింది.