Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ని ఢీ కొట్టడానికి సిద్దమవుతున్న తమిళ నటుడు..

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బాబీ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "వాల్తేరు వీరయ్య". ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన టీజర్ అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే పాత్రలో..

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ని ఢీ కొట్టడానికి సిద్దమవుతున్న తమిళ నటుడు..

Tamil Actor Simha Playing a Negative Role in Waltair Veerayya

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బాబీ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన టీజర్ అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. చిరుకి వీరాభిమాని అయిన బాబీ తన అభిమాన హీరోని ఈ సినిమాలో మాస్ మూలవిరాట్ పాత్రతో తాండవం చేయించబోతున్నాడని చెబుతున్నారు మూవీ మేకర్స్.

Waltair Veerayya: దేవిశ్రీ వాయింపుడుకు ‘వాల్తేరు వీరయ్య’ ఫుల్ హ్యాపీ..?

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే పాత్రలో తమిళ నటుడు సింహా ‘సోల్‌మాన్ సీసర్’ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈరోజు సింహా పుటినరోజు కావడంతో మూవీ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. గతంలో ఈ యాక్టర్ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ గా నటించాడు.

ఇప్పుడు మళ్ళీ రవితేజతో కలిసి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకొన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి చిందేయనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.