Unstoppable 2 : 30 వేలమంది అభిమానుల మధ్య.. విజయవాడలో బాలయ్యబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 లాంచ్..

అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ ని అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే ఇది సాధారణంగా కాకుండా విజయవాడ వేదికగా దాదాపు 30 వేలమంది అభిమానుల మధ్య.........

Unstoppable 2 : 30 వేలమంది అభిమానుల మధ్య.. విజయవాడలో బాలయ్యబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 లాంచ్..

Unstoppable 2 teaser launch in Vijayawada

Unstoppable 2 :  బాలయ్య బాబు గత సంవత్సరం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడం, అన్‌స్టాపబుల్ అంటూ ఆహాలో సరికొత్త షోతో మరింత కొత్తగా కనపడి ఆ షో కూడా హిట్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా బాలయ్యని ఇలాగే చూడాలని అనుకుంటున్నాము అంటున్నారు.

ఇటీవలే బాలయ్య హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 రాబోతుందని ప్రకటించి ఆ షో మీద మరిన్ని హైప్స్ పెంచారు. అన్‌స్టాపబుల్ యాంతం అంటూ ఓ ర్యాప్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. బాలయ్య అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా కొత్త సీజన్ ఎప్పుడొస్తుంది, సెలబ్రిటీలు ఎవరెవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. బాలయ్య కౌబాయ్ గెటప్ లో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసి ఈ సారి అన్‌స్టాపబుల్ సీజన్ 2 మరింత కొత్తగా ఉండబోతుందని ప్రకటించారు.

Naveen polishetty : ఒకప్పుడు ఇక్కడే పాసులు లేక ఈవెంట్స్ లోపలికి రానివ్వలేదు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చా..

తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ఈ షో నిర్వాహకులు ప్రకటించారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ ని అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే ఇది సాధారణంగా కాకుండా విజయవాడ వేదికగా దాదాపు 30 వేలమంది అభిమానుల మధ్య అక్టోబర్ 4వ తేదీన అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ ని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఒక ఓటీటీ షోకి ఇలా టీజర్ లాంచ్ గ్రాండ్ గా నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అభిమానులకి పాసులు కూడా అందించారు. దీంతో ఈ షోపై మరిన్ని అంచనాలు పెరిగాయి.