Varun – Lavanya : లావణ్య – వరుణ్ తేజ్ లవ్ స్టోరీ తెలుసా..? ఎప్పట్నించి ప్రేమించుకుంటున్నారో చెప్పేశారు..

వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. వీరిద్దరూ గతంలో మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు కలిసి చేశారు.

Varun – Lavanya : లావణ్య – వరుణ్ తేజ్ లవ్ స్టోరీ తెలుసా..? ఎప్పట్నించి ప్రేమించుకుంటున్నారో చెప్పేశారు..

Varun Tej and Lavanya Tripathi Love Story Revealed

Varun – Lavanya Love Story :  హీరో వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకొని జూన్ 9న నిశ్చితార్థం (Engagement) చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు.

వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. వీరిద్దరూ గతంలో మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు కలిసి చేశారు. అయితే వీరు మిస్టర్ సినిమాతో పరిచయం అయి అంతరిక్షం సినిమాకి మరింత క్లోజ్ గా మారి ప్రేమించుకున్నారని అనుకున్నారు. కానీ లావణ్య తమ నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి 2016 నుంచే వీరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది.

మిస్టర్ సినిమా 2017లో రిలీజయింది. అయితే ఈ సినిమా షూటింగ్ 2016 లోనే మొదలైంది. అప్పటినుంచే తమ ప్రేమ మొదలైనట్టు లావణ్య ఇండైరెక్ట్ గా చెప్పేసింది. దీంతో ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఎవ్వరికి తెలియకుండా భలే మెయింటైన్ చేశారే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కొన్నాళ్ల క్రితం వరుణ్ బర్త్‌డే పార్టీకి లావణ్య రావడం, పలు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించడం, నిహారిక పెళ్ళికి లావణ్య వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. వరుణ్ – లావణ్యలు ఏకంగా 7 సంవత్సరాలు లవ్ చేసుకొని ఇప్పుడు ఫ్యామిలీస్ ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు.

Varun -Lavanya : నా లవ్ దొరికింది.. నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేస్తూ వరుణ్, లావణ్య స్పెషల్ పోస్ట్..

ఇక లావణ్యకు మెగా అభిమానులు మెగా కోడలు అంటూ స్వాగతం చెప్తున్నారు. ఈసంవత్సరంలోనే వీరి వివాహం ఉండే ఛాన్స్ ఉంది. పలువురు అభిమానులు, సెలబ్రిటీలు వీరికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)