Naga Chaitanya : నాగచైతన్యతో కలిసి వంటలు నేర్చుకుంటున్న వెంకటేష్ కూతురు.. బావ అంటూ ముద్దు ముద్దు మాటలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం, దగ్గుపాటి కుటుంబం బంధువులని అందరికి తెలిసిన విషయమే. విక్టరీ వెంకటేష్ చెల్లి లక్ష్మి, అక్కినేని నాగార్జునకి పుట్టిన కొడుకే నాగచైతన్య. కాగా వెంకటేష్ పెద్ద కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటి తన బావ చైతన్యతో కలిసి వంటలు నేర్చుకుంటుంది. ఆశ్రిత "ఇన్ఫినిటీ ప్లాటర్" పేరుతో యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ అలరిస్తుంటుంది.

Naga Chaitanya : నాగచైతన్యతో కలిసి వంటలు నేర్చుకుంటున్న వెంకటేష్ కూతురు.. బావ అంటూ ముద్దు ముద్దు మాటలు..

Venkatesh's daughter Aashritha is learning cooking with Naga Chaitanya

Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం, దగ్గుపాటి కుటుంబం బంధువులని అందరికి తెలిసిన విషయమే. విక్టరీ వెంకటేష్ చెల్లి లక్ష్మి, అక్కినేని నాగార్జునకి పుట్టిన కొడుకే నాగచైతన్య. కాగా వెంకటేష్ పెద్ద కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటి తన బావ చైతన్యతో కలిసి వంటలు నేర్చుకుంటుంది. ఆశ్రిత “ఇన్ఫినిటీ ప్లాటర్” పేరుతో యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ అలరిస్తుంటుంది.

Naga Chaitanya: నాగచైతన్య డేటింగ్ వార్తలు నిజమేనా..?

తాజాగా నాగచైతన్య ప్రారంభించిన ‘షోయు’ క్లౌడ్ కిచెన్ ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక వీడియో చేసి తన వ్లాగ్‌లో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ తర్వాత చైతన్య ఈ పాన్-ఆసియన్ ఫుడ్ కిచెన్‌ను ఎందుకు ప్రారంభించాడో, రెస్టారెంట్‌ కాకుండా ఇలా ఇ-కామర్స్ ఫుడ్ పార్టనర్‌ల ద్వారా ఆహారాన్ని విక్రయించే క్లౌడ్ కిచెన్‌ను మాత్రమే ఎందుకు ప్రారంభించారనే దాని గురించి చై వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇక వీడియో స్టార్టింగ్‌లో ఆశ్రిత.. “మై బావ చై” అంటూ పరిచయం చేయడం. తన బావ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసుకొని ఇద్దరు కలిసి ఫుడ్ తయారు చేయడం. వీడియో మొత్తం ఆశ్రిత, చైతన్యని ‘బావ’ అని ముద్దుముద్దుగా పిలుస్తుంటే అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ గా మారిపోయింది.