Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..

తాజాగా ఈ సినిమాని చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సినిమాని అభినందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం విశేషం. వెంకయ్య నాయుడు ట్విట్టర్లో.. ''సీతారామం చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం.............

Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..

Venkayya naidu

Sita Ramam :  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీతారామం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. దేశభక్తి, ప్రేమ అంశాలు కలగలిపి ఒక అందమైన సినిమాగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

Lucifer 2 : మోహన్ లాల్ లూసిఫర్‌2.. అబ్రహాం ఖురేషి ఎవరు.. ఈ సారి అంతకు మించి..

తాజాగా ఈ సినిమాని చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సినిమాని అభినందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం విశేషం. వెంకయ్య నాయుడు ట్విట్టర్లో.. ”సీతారామం చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు” అని పోస్ట్ చేశారు. వెంకయ్య నాయుడు ట్వీట్ పై హీరో, హీరోయిన్స్, చిత్ర యూనిట్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.