Vijay Antony : విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నోట్ దొరికింది..

విజయ్ ఆంటోనీ కూతురు ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రూమ్‌లో..

Vijay Antony : విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నోట్ దొరికింది..

Vijay Antony daughter demise letter found in her room

Updated On : September 22, 2023 / 8:17 AM IST

Vijay Antony : బిచ్చగాడు (Bichagadu) హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా (Laura) ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ విషయం ప్రతి ఒక్కర్ని కలిచివేస్తుంది. మంగళవారం (సెప్టెంబర్ 19) నాడు తన రూమ్ లోని ఫ్యాన్ కి మీరా ఉరివేసుకొని కనిపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ సంఘటన ఇంటిలో వారికీ తెలియడం, మీరాని వెంటనే హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్స్ తెలియజేయడంతో విజయ్ ఆంటోనీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది.

Vijay Antony : విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొని..

ఇక ఆమె మరణానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. తాజాగా ఆ రూమ్ లో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ ఏం రాసి ఉంది అంటే.. “నేను మీ అందర్నీ ఎంతో ప్రేమిస్తానని. మిమ్మల్ని నేను మిస్ అవుతాను. ఫ్రెండ్స్, టీచర్స్ అందర్నీ. నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ చాలా బాధ పడుతుంది” అని ఎమోషనల్ గా రాసినట్లు సమాచారం. పోలీసులు ఆ లెటర్ గురించి ఇంకా అఫీషియల్ గా తెలియజేయలేదు. మీరా ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది.

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ టీం వార్నింగ్ నోట్.. ఇక నుంచి అలా చేస్తే..

కాగా ఆమె గత కొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తమిళ మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. చదువుల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. అసలు నిజాలు పోలిసుల విచారణలోనే తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొనే మరణించారు. ఇప్పుడు తన కూతురు కూడా ఇలా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. కాగా విజయ్ ఆంటోనీకి మరో కూతురు కూడా ఉంది.