Samantha : సమంతతో నేను అప్పుడే ప్రేమలో పడిపోయాను.. ఇప్పటికి కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్..

విజయ్ యశోద ట్రైలర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. విజయ్ సమంతని ఉద్దేశించి...............

Samantha : సమంతతో నేను అప్పుడే ప్రేమలో పడిపోయాను.. ఇప్పటికి కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్..

vijay devarakonda intresting tweet on samantha

Samantha :  చైతూతో విడాకుల తర్వాత సమంత వరుసపెట్టి తన సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది. పుష్ప ఐటెం సాంగ్ తప్ప సమంత నుంచి ఫుల్ సినిమా చాలా రోజులుగా రాకపోవడంతో అభిమానులు నిరాశతో ఎదురు చూస్తున్నారు. తాజాగా సమంత మొదటి పాన్ ఇండియా సినిమా, లేడి ఓరియెంటెడ్ సినిమా యశోద రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఆగస్టులో రిలీజ్ చేద్దామనుకున్న యశోద వాయిదా పడింది. నవంబర్ 11న యశోద సినిమాని రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు చిత్ర యూనిట్. అలాగే గురువారం నాడు యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో ఆ భాషకి సంబంధించిన ఒక్కో హీరోతో యశోద ట్రైలర్ ని లాంచ్ చేయించారు. మన తెలుగులో యశోద ట్రైలర్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు.

BiggBoss 6 Day 53 : ఈ వారం కెప్టెన్ ఎవరో తెలుసా??

ఈ మేరకు విజయ్ యశోద ట్రైలర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. విజయ్ సమంతని ఉద్దేశించి.. నేను కాలేజీ చదువుకునే రోజుల్లో సమంతని మొట్టమొదటిసారి స్క్రీన్ మీద చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. తను సాధించిన వాటిని చూసి నేను ఇప్పటికి సమంతని ఆరాధిస్తాను అని ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం విజయ్, సమంత కలిసి ఖుషి సినిమా కూడా చేస్తున్నారు. విజయ్, సమంత బర్త్ డేల సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఫోటోలు దిగి పోస్ట్ చేశారు. ఇప్పుడు విజయ్ సమంతతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను అనడంతో నెటిజన్లు వీరిద్దరి గురించే చర్చిస్తున్నారు.