Vijay Devarakonda-Sukumar : సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా.. క్లారిటీ ఇచ్చిన విజయ్..

గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఫాల్కన్ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమాని ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆ సినిమా ఆగిపోయిందని వినిపిస్తుంది. 2020లో ఈ సినిమాని ప్రకటించి 2022 లో రాబోతుందని తెలిపారు. కానీ ఇప్పటిదాక............

Vijay Devarakonda-Sukumar : సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా.. క్లారిటీ ఇచ్చిన విజయ్..

Vijay Deverakonda is doing a film with Sukumar after Pushpa 2

Vijay Devarakonda-Sukumar :  రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చేతి నిండా ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడు విజయ్. ప్రస్తుతం లైగర్ రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో ఖుషి సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనగణమన సినిమా కూడా షూటింగ్ మొదలుపెట్టేశాడు.

అయితే గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఫాల్కన్ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమాని ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆ సినిమా ఆగిపోయిందని వినిపిస్తుంది. 2020లో ఈ సినిమాని ప్రకటించి 2022 లో రాబోతుందని తెలిపారు. కానీ ఇప్పటిదాక దీనిమీద ఎలాంటి అప్డేట్ లేకపోవడం, విజయ్-సుకుమార్ ఇప్పటివరకు కలవకపోవడం, విజయ్ వరుసగా వేరే సినిమాలు ఒప్పుకోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

Liger Pre Release Event : లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

 

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ”సుకుమార్‌తో సినిమా ఉంది. కాని దానికి టైం పడుతుంది. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. పుష్ప 2 సినిమా అయిపోయిన తర్వాత మా సినిమానే మొదలుపెడతారు. అందుకు కొంచెం టైం పడుతుంది” అని తెలిపాడు. దీంతో లెక్కల మాస్టర్ తో విజయ్ సినిమా ఉందని క్లారిటీ రావడంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా రావాలంటే 2024 అవ్వొచ్చు అని తెలుస్తుంది.