Vijay Deverakonda : విజయ్ ఇచ్చే లక్ష రూపాయలు పొందేందుకు.. ఇక్కడ అప్లై చేసుకోండి..
విజయ్ దేవరకొండ అనౌన్స్ చేసిన లక్ష రూపాయిల ప్రైజ్ మనీ కోసం అప్లై చేసుకోవాలంటే..

Vijay Deverakonda Kushi 1 lakh prize money application
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ఖుషి’ (Kushi) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం అంతా ఫుల్ ఖుషీలో ఉంది. దీంతో నిన్న సెప్టెంబర్ 4న వైజాగ్(Vizag) లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ.. తన అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాని హిట్ చేసి తనకి ఖుషీ పంచిన అభిమానులకు.. ఆ ఖుషీని తిరిగి ఇస్తాను అని చెప్పి ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాడు.
Mega 157 : చిరంజీవి, వసిష్ఠ సినిమా మొదలయ్యేది అప్పుడేనా..?
ఒక 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి.. ప్రతి కుటుంబానికి ఒక లక్ష చొప్పున ప్రైజ్ మనీ అందిస్తాను అంటూ ప్రకటించాడు. తాజాగా ఆ లక్ష రూపాయల ప్రైజ్ మనీ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలియజేశాడు. తన సోషల్ మీడియా ద్వారా ఒక గూగుల్ ఫార్మ్ ని ఫార్వర్డ్ చేశాడు. ఆ గూగుల్ ఫార్మ్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిలిం చేసి పంపిస్తే.. విజయ్ దేవరకొండ టీం ఆ ఫార్మ్స్ అన్ని పరిశీలించి ఒక 100 కుటుంబాలను ఎంపిక చేస్తారు. ఆ తరువాత వారికీ ఆ లక్ష రూపాయిల చెక్ ని అందిస్తారు. మరి మీరుకూడా ఆ లక్ష రూపాయిలు కోసం అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. Click Here
కాగా ఖుషి మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తున్న ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో 70 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ దూకుడు చూస్తుంటే.. ఫస్ట్ వీక్ పూర్తి అయ్యేలోపే సినిమా 100 కోట్లు కలెక్షన్స్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అమెరికాలో కూడా కలెక్షన్స్ లో జోరు కనిపిస్తుంది.