Kamal Haasan : కమలహాసన్ మూవీలో విలన్‌గా.. మరోసారి ఆ స్టార్ హీరో..

విక్రమ్ మూవీతో సాలిడ్ కామ్‌బ్యాక్ ఇచ్చాడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ప్రస్తుతం కమల్ ఇండియన్-2 మూవీని ముగించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం కమల్ ఇండియన్-2 మూవీని ముగించే పనిలో పడ్డాడు. కామ్‌బ్యాక్ తరువాత కమల్ సినిమా విషయంలో వేగం పెంచేసాడు. తాజాగా ఈ సీనియర్ హీరో మరో యువదర్శకుడితో జత కట్టబోతున్నాడు.

Kamal Haasan : కమలహాసన్ మూవీలో విలన్‌గా.. మరోసారి ఆ స్టార్ హీరో..

Vijay Sethupathi as Villain in Kamal Haasan Movie

Kamal Haasan : విక్రమ్ మూవీతో సాలిడ్ కామ్‌బ్యాక్ ఇచ్చాడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కమల్ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. ప్రస్తుతం కమల్ ఇండియన్-2 మూవీని ముగించే పనిలో పడ్డాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆర్ధిక ఇబ్బందులు వల్ల గతంలో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇటీవల మళ్ళీ పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

Kamal Haasan: దశాబ్దాలు తరువాత పాత దర్శకులతో జత కడుతున్న కమల్ హాసన్..

కామ్‌బ్యాక్ తరువాత కమల్ సినిమా విషయంలో వేగం పెంచేసాడు. తాజాగా ఈ సీనియర్ హీరో మరో యువదర్శకుడితో జత కట్టబోతున్నాడు. అజిత్ ‘తునివు’ తెరకెక్కిస్తున్న H వినోద్, కమల్ హాసన్ 233వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో కమల్ కి విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరోసారి నటించనున్నాడట. ‘విక్రమ్’ సినిమాలో విజయ్ విలన్ గా నటించాడు.

ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. కాగా కమల్ తన 234వ మూవీని కూడా ఇటీవల అనౌన్స్ చేశాడు. దాదాపు 35 ఏళ్ళ తరువాత మళ్ళీ మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ నటించబోతున్నాడు. ఈ సినిమాను మణిరత్నం, కమలహాసన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.