Vikram : చియాన్ 61.. పల్లెటూరి వ్యక్తిగా విక్రమ్ ‘తంగలాన్’.. గ్లింప్స్ రిలీజ్..

తాజాగా దీపావళి నాడు ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ పక్కా పల్లెటూరి లుక్ లో కనిపించాడు. ఫుల్ గా గడ్డం ఉంచుకొని, ఒంటి మీద కేవలం......

Vikram : చియాన్ 61.. పల్లెటూరి వ్యక్తిగా విక్రమ్ ‘తంగలాన్’.. గ్లింప్స్ రిలీజ్..

Vikram 61 movie titile announced as Thangalaan

Vikram :  చియాన్ విక్రమ్ ఇటీవల కోబ్రా, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. కమర్షియల్ గా భారీ సక్సెస్ కొట్టకపోయినా కోబ్రా సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రకరకాల గెటప్స్ తో విక్రమ్ ఈ సినిమాలో అలరించాడు. ఇక పొన్నియిన్ సెల్వన్ తమిళ్ లో మంచి విజయం సాధించింది. గతంలో విక్రమ్ 61వ సినిమాగా పా రంజిత్ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Amithab Bachchan : అమితాబ్ కాలికి గాయం.. అయినా షూటింగ్ లో పరిగెత్తుతూ..

తాజాగా దీపావళి నాడు ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ పక్కా పల్లెటూరి లుక్ లో కనిపించాడు. ఫుల్ గా గడ్డం ఉంచుకొని, ఒంటి మీద కేవలం గోచి మాత్రమే ఉంచుకొని పల్లెటూరి వ్యక్తిలా కనిపించాడు. ఈ గ్లింప్స్ లో చూపించిన విజువల్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి ‘తంగలాన్‌’ అనే పేరును ప్రకటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా పీరియాడికల్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మాళవిక మోహనన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో విక్రమ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది.