Virupaksha : అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాయి ధరమ్ ‘విరూపాక్ష’ ట్రైలర్ అదుర్స్..

రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఇంటికే పరితమైన సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు తన 15వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ నేడు టైటిల్ గ్లింప్స్‌ ని విడుదల చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ టైటిల్ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

Virupaksha : అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాయి ధరమ్ ‘విరూపాక్ష’ ట్రైలర్ అదుర్స్..

Virupaksha Title Glimpse Released

Virupaksha : రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఇంటికే పరితమైన సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు తన 15వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ నేడు టైటిల్ గ్లింప్స్‌ ని విడుదల చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ టైటిల్ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

RRR : IGN బెస్ట్ మూవీస్ నామినేషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’..

“అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. మొత్తానికి టీజర్ అయితే ఒక కొత్త కథని చూడబోతున్నామనే అనుభూతుని ఇచ్చింది. ఇక ‘విరూపాక్ష’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ నీ కూడా అనౌన్స్ చేసేశారు మూవీ మేకర్స్. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా, అతడి శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.